ETV Bharat / state

వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళం-మానవత్వం చాటుకుంటున్న దాతలు - Chiranjeevi Donate One Crore - CHIRANJEEVI DONATE ONE CRORE

Chiranjeevi Donate One Crore Two Telugu States : వరదలు అల్లకల్లోలం సృష్టించిన ప్రాంతాల్లోని బాధితుల ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. మానవత్వం చాటుకుంటూ పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. చిత్ర సీమ నుంచి భారీ విరాలాలు వస్తున్నాయి. విజయవాడ వరద బాధితులకు పలు ప్రాంతాల నుంచి ఆహార పొట్లాలు, తాగునీరు పంపిస్తున్నారు.

chiranjeevi_donate_one_crore_two_telugu_states
chiranjeevi_donate_one_crore_two_telugu_states (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 10:03 AM IST

Updated : Sep 4, 2024, 10:26 AM IST

Chiranjeevi Donate One Crore Two Telugu States : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళమిచ్చారు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక రూ.50 లక్షలు ప్రకటించారు.

‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదోవిధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లోని ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళం-మానవత్వం చాటుకుంటున్న దాతలు (ETV Bharat)

Huge Donations to Flood Victims : వరద బాధితులను ఆదుకునేందుకు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముదుకొస్తున్నాయి. హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ సంస్థ తెలుగు రాష్ట్రాలకు 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఏపీ సీఎం సహాయ నిధికి కోటి, తెలంగాణ సీఎం రిలీఫ్‌ పండ్‌కి కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు సంస్థ ఎండీ నారా భువనేశ్వరి తెలిపారు.విజయవాడ వరద బాధితుల కోసం మాజీ సీఎం జగన్‌ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.

విజయవాడ వరద బాధితుల కోసం భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్‌ రామకృష్ణ 60 వేల ఆహార పొట్లాలను గుంటూరు నుంచి పంపించారు. పర్చూరు MLA ఏలూరి సాంబశివరావు విజయవాడ వరద బాధితుల కోసం 25 వేల ఆహార పొట్లాలు, తాగునీటి బాటిళ్లు పంపించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం, మంగళవారం రెండ్రోజులు కలిపి 45 వేల ఆహార పొట్లాలను విజయవాడకు పంపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని పొదుపు సంఘాల మహిళలు యాపిల్స్‌, చీనీ పళ్లు, 15 వేల జొన్న రొట్టెలు, బిస్కెట్లను విజయవాడకు పంపించారు.

వరద బాధితులకు టాలీవుడ్​ హీరోల సాయం - కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్​కల్యాణ్​ - Actors Donation to Flood Victims

ప్రకాశం జిల్లా కనిగిరిలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు మూడు లక్షల రూపాయల విరాళాలు సేకరించి స్థానిక ఎంఈఓకి అందజేశాయి. ఆల్ఫా విద్యాసంస్థల అధినేత మాల కొండారెడ్డి 15 వేలు విరాళంగా అందించారు. స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి 5000 ఆహార పొట్లాలను కనిగిరి నుంచి విజయవాడకు పంపించారు.విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు విజయనగరం జిల్లా రాజాం ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో పాత్రికేయులు ముదుకొచ్చారు. వ్యాపార సముదాయాలకు వెళ్లి విరాళాలు ఆర్జించారు.

కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలోని నీట మునిగిన పలు గ్రామాల ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు సహాయం అందిస్తున్నాయి.సేవ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో 12 వేల పులిహోర పొట్లాలు బాధితులకు పంపిణీ చేశారు. అవినగడ్డలో ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్‌ ఎడ్లలంకలో ఆహారం అందించారు. జనసేనాని పిలుపుతో పలు పునరావాస కేంద్రాల్లో జనసైనికులు భోజనం అందించారు. మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడులో ఆహారం, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ 5 లక్షలు, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పి.లక్ష్మీవెంకటనారాయణ మూర్తి యాదవ్‌ దంపతులు 1.2 లక్షల విరాళాన్ని లోకేష్‌కి అందింతారు.

వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం అందించదలచిన దాతలు ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన నిర్దేశిత పాయింట్‌ని సంప్రదించాలని ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించి IAS అధికారి మనజీర్‌ని 79 06 79 61 05 ద్వారా సంప్రదించాలని ఓ ప్రకటనలో సూచించింది. ఆర్థిక సాయం చేయదలిచిన వారు ఆన్‌లైన్‌ ద్వారా SBI అకౌంట్‌ పేరు: C.M.R.F. నెంబర్‌ 385880 79208, బ్రాంచ్‌ : ఏపీ సెక్రటేరియెట్‌, వెలగపూడి, IFSC కోడ్‌ : SBIN 0018884, యూనియన్‌ బ్యాంక్‌ ఖాతా పేరు సీఎం రిలీఫ్‌ ఫండ్‌, నెంబర్‌ 1103101 00029039, బ్రాంచ్‌ : ఏపీ సెక్రటేరియెట్‌, వెలగపూడి, IFSC కోడ్‌: UBIN 0830798 కి పంపాలని సూచించింది.

Last Updated : Sep 4, 2024, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.