CM Chandrababu Visit to Uttarandhra Districts: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుందని ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తామన్నారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అనకాపల్లి జిల్లా దార్లపూడిలో వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేస్తే అనకాపల్లిలో 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని టెండర్లు పిలిచి వీలైనంత తొందరగా ప్రాజెక్టు పూర్తిచేస్తామని భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలోని 3 చక్కెర కర్మాగారాలు పడకేసే పరిస్థితికి తెచ్చారని వాటిని పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
సాగర గర్భంలో ఊళ్లు, భూములు - ఇప్పటివరకు 1360 ఎకరాలు కనుమరుగు - Coastal Erosion in ap
విశాఖను దోచుకున్నారు: వైఎస్సార్సీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం మొత్తం గుంతలమయంగా మారిందని ప్రజల బతుకులు ఆగమయ్యాయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు విశాఖను దోచుకున్నారని వారిమీద తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజా కోర్టులో శిక్షించారని చెప్పారు. ప్రజలు గెలిచారని రాష్ట్రం నిలదొక్కుకునేందుకు బాధ్యతగా పని చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైఎస్సార్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తాను అంగీకరించినట్లు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విషప్రచారాలు నమ్మొద్దని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు: వాజ్‌పేయి ప్రభుత్వంలో టీడీపీ స్టీల్ ప్లాంట్‌ను కాపాడిందని, ఇప్పుడు మళ్లీ కాపాడుతుందని అన్నారు. పోలవరం ఎడమ కాలువ ఐదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమ కాలువ 214 కిలోమీటర్లు రావాలని అన్నారు. పోలవరం డయ ఫ్రమ్ వాల్‌ను గోదావరిలో కలిపేశారనీ మండిపడ్డారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం అని కొనియాడారు. పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుంటే ప్రతి ఎకరానికి నీళ్లు అందిచవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
రాయితీపై నిత్యవసర సరుకులు- ప్రత్యేక స్టాల్స్ ప్రారంభం - Distribution of Household goods
పట్టాలెక్కుతున్న పురోగతి- ఎన్డీయే ప్రభుత్వంతో రహదారులకు మోక్షం - Widening of National Highway 44