Chicken Price in Hyderabad : చాలా మంది మాంసాహార ప్రియులకి ముక్కలేనిదే ముద్ద దిగదు. కనీసం వారంలో రెండు రోజులైనా చికెన్, మటన్ వంటివి తింటుంటారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు. ఇంట్లో తప్పనిసరిగా చికెన్ ఉండాల్సిందే. అయితే మటన్ ధర ఎక్కువగా ఉండడంతో మెజార్టీ జనాలు చికెన్ ఎక్కువగా కొంటారు. మొన్నటి వరకు ఆషాఢమాసంలో కేజీ చికెన్ ధర రూ.300 వరకు పెరిగింది. దీంతో చికెన్ ప్రియులు కేజీ తెచ్చుకునే దగ్గర అరకిలో తెచ్చుకున్నారు. కానీ, శ్రావణమాసం మొదలు కావడంతో పరిస్థితి మారిపోయింది. కారణంగా చికెన్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. మరి హైదరాబాద్‌లో ప్రస్తుతం చికెన్ ధరలు ఎంత ఉన్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
చాలా ధర తగ్గింది!
గత నెలలో చాలా ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.300 మార్క్ క్రాస్ అయింది. కానీ ఇప్పుడు భారీగా తగ్గడానికి కారణం శ్రావణ మాసం. ఈ మాసంలో చాలా మంది మహిళలు ఇంట్లో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. దీంతో మాంసాహారం వండరు. ఈ కారణంగానే చికెన్ ధర భారీగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.150 వరకు లభిస్తున్నట్టు సమాచారం. డ్రెస్డ్ చికెన్ రూ.120కే అమ్ముతున్నారు. ఇక లైవ్ కోడి అయితే 90 రూపాయలకే ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ధర ఎందుకు తగ్గుంది?
శ్రావణ మాసంలో చాలా మంది మహిళలు ఇంట్లో వరలక్ష్మీ వ్రతాలు చేసుకుంటారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున చాలా మంది ఇళ్లలో వ్రతాలు చేసుకుంటారు. ఇదే కాకుండా శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు. ఇలా ఈ శ్రావణ మాసం మొత్తం ప్రతిరోజు ఏదోక ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో మహిళలు పాల్గొంటారు. దీంతో నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటారు. కానీ ఫౌల్ట్రీ నుంచి ఉత్పత్తి అయ్యే కోళ్ల సంఖ్య మాత్రం తగ్గదు. అదే సమయంలో నిర్ణీత గడువు దాటిన తర్వాత ఎదిగిన కోళ్లను ఫామ్‌లో ఉంచరు. వీటిని అక్కడ ఉంచడం వల్ల దాణా నష్టం తప్పఋ బిజినెస్‌లో ఎలాంటి లాభమూ ఉండదు. అందుకే జనం చికెన్ ఎక్కువగా కొనకపోయినా కూడా కోళ్లను షాపులకు తరలిస్తుంటారు. ఈ కారణంగానే చికెన్ ధర తగ్గుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
కూరగాయలు, గుడ్డు ధరలు మాత్రం పై పైకి : మరో వైపు గుడ్డు ధర మాత్రం తగ్గడం లేదు. బయట షాపుల్లో ఒక్కో గుడ్డు ఆరు రూపాయలకు పైనే అమ్ముతున్నారు. అలాగే మార్కెట్లో కూరగాయల ధరలూ పెరిగిపోయాయి. ఈ శ్రావణమాసంలో నోములు, వ్రతాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఎక్కువగా ఉండడంతో కూరగాయలకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కూరగాయల ధరలు క్రమంగా పైకి చేరుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
శ్రావణమాసం ఎఫెక్ట్ : నాన్‌వెజ్ ప్రియులకు అద్దిరిపోయే న్యూస్ - కేజీ చికెన్ 100 రూపాయలే! భారీగా తగ్గిన చికెన్ రేట్లు!!