ETV Bharat / state

జగన్‌ పింఛనర్ల పొట్టకొట్టారు - దిగిపోతూ కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు: చంద్రబాబు - Chandrababu on Pensions Delay in AP - CHANDRABABU ON PENSIONS DELAY IN AP

Chandrababu on Pensions Delay in AP: తన రాజకీయ స్వార్థం కోసం జగన్‌ పింఛనర్ల పొట్టకొట్టారని, అధికారం నుంచి దిగిపోతూ కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే రూ.4 వేల రూపాయల పింఛన్‌ ఇస్తామని తెలిపారు. ఈ 2 నెలలు ఎవరికైనా పింఛన్‌ అందకుంటే అదికూడా కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి మెరుగైన జీతం వచ్చేలా చేస్తామని భరోసా ఇచ్చారు.

Chandrababu_on_Pensions_Delay_in_AP
Chandrababu_on_Pensions_Delay_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 4:45 PM IST

Chandrababu on Pensions Delay in AP: తన రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పింఛనర్ల పొట్టకొట్టాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే 4 వేల రూపాయల పింఛన్‌ ఇవ్వటంతో పాటు ఈ రెండు నెలలు ఎవరికైనా పింఛన్‌ అందకుంటే అది కూడా కలిపి ఇస్తామని తేల్చి చెప్పారు. బాబాయికి గొడ్డలి వేటు వేయించినవాడు, ఇప్పుడు పింఛన్‌ దారుల గొంతు కోస్తున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారం నుంచి దిగిపోతూ కూడా తన పైశాచికత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పేదలపై ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. పింఛన్‌ కోసం అవ్వా తాతలను మండుటెండలో నడిపించి ఇబ్బంది పెడుతున్న పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు.

పేదలకు ఇంటివద్ద పింఛన్‌ ఇప్పించే వరకూ తెలుగుదేశం నేతలు వదలిపెట్టవద్దని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలను కలిసి ఒత్తిడి పెంచి పింఛన్‌ ఇళ్ల వద్దే అందేలా ఒత్తిడి తీసుకురావాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రజాక్షేత్రంలో జగన్​ను దోషిగా నిలబెట్టాలన్న ఆయన, సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్​ను ఇంటి వద్ద ఎందుకు పంపిణీ చేయలేకపోతోందో ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి సేఫ్ డ్రైవర్ నేనే- దారి తప్పిన ఏపీని మరలా గాడిలో పెడతా: చంద్రబాబు - Chandrababu Fire on CM Jagan

కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు: కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత జగన్ రెడ్డి 15 రోజుల్లో 13 వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులు ఇచ్చిందో ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారు. మే 13వ తేదీ తరువాత ఇంటికి పోయే జగన్, ఖజానాలో ఉన్న డబ్బు అంతా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, పేదలకు ఇచ్చే డబ్బులు విషయంలో మాత్రం నాటకాలు అడుతున్నాడని ఆక్షేపించారు.

వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం: బిల్లుల చెల్లింపుల్లో లంచాలకు కక్కుర్తిపడి కమీషన్ తీసుకుని పేదల పొట్టగొడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్నికల (Andhra Pradesh Elections 2024) తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. న్యూట్రల్​గా పనిచేసే వాలంటీర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఆయన, వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి మెరుగైన జీతం వచ్చేలా చేస్తామన్నారు.

జగన్​కు తన ఓటమి అర్థమైంది: ప్రజాగళం సభల స్పందన మిత్ర పక్షాల గెలుపునకు సూచకంగా కనిపిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలనే బలమైన కసి ప్రజల్లో కనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్​కు తన ఓటమి అర్థమైనందునే ఫేక్ ప్రచారాలు పెంచి, కుట్రా రాజకీయాల వేగం పెంచాడని దుయ్యబట్టారు.

జగన్‌కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు: చంద్రబాబు - chandrababu praja galam yatra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.