Chandrababu called Namburi Seshagiri Rao: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అనుచరుల దాడిలో గాయపడిన నంబూరి శేషగిరిరావుతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడారు. శేషగిరిరావు ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించిన శేషగిరిరావుపై ఎమ్మెల్యే వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తరువాత శేషగిరిరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా సిట్ విచారణలో ఎమ్మెల్యేపై కేసునమోదుతో అజ్ఞాతం వీడి బయటకు వచ్చి దాడి ఘటన వివరాలు వెల్లడించారు. దాడి విషయం తెలుసుకున్న చంద్రబాబు శేషగిరిరావుతో ఫోన్‌లో మాట్లాడి అభినందించారు.
పారిపోవాలనుకున్న పిన్నెల్లి - పట్టుకున్న పోలీసులు ! - MLA Pinnelli arrested
పోలీంగ్ కేంద్రం వద్ద దాడి జరిగిన తరువాత శేషగిరిరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా పోలింగ్ రోజు మాచర్లలో జరిహిన ఘటనను తెలుగుదేశం ఏజెంట్ శేషగిరిరావు మీడియాతో పంచుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజా ప్రతినిధిలా కాకుండా వీధి రౌడీలా ఈవీఎం ధ్వంసం చేశారని నంబూరి శేషగిరిరావు తెలిపారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా ఉన్న తరుణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో దూసుకు వచ్చి స్వయంగా ఈవీఎం పగలగొట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చర్యలకు ఎన్నికల సిబ్బంది ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేసిన తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.
దాడిని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం: మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేసిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని వివరణ కోరింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందా..? అని ప్రశ్నించిన సీఈసీ, ఒకవేళ ఎమ్మెల్యే ప్రమేయం ఉంటే కేసు ఎందుకు పెట్టలేదని నిలదీసింది. కేసులో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా అని సీఈఓను అడిగింది. ఒకవేళ నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా? లేదా? అని ప్రశ్నించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.