ETV Bharat / state

ఓటు వేసేందుకు వస్తున్న వారికి రవాణా సౌకర్యం కల్పించండి- ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు ఫోన్ - Chandrababu Called APSRTC MD - CHANDRABABU CALLED APSRTC MD

Chandrababu Called APSRTC MD to Arrange Special Buses: ఓటు వేసేందుకు స్వస్థలాలకు వస్తున్నవారికి బస్సులు ఏర్పాటు చేయాలి జనసేన నేత నాదెండ్ల మనోహర్ కోరారు. ఎన్నికల సంఘం అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని అన్నారు. ఓటు వేసేందుకు వస్తున్నవారు బస్సుల్లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులు స్పందించి తగిన ఆదేశాలివ్వాలని నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు.

chandrababu_called_apsrtc_md
chandrababu_called_apsrtc_md (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 10:17 PM IST

Chandrababu Called APSRTC MD to Arrange Special Buses: రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఒక్క రోజే ఉండటంతో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. అయితే పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. అయితే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాల్సిందిపోయి రోజువారీ బస్సులను రద్దు చేయటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై చంద్రబాబు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: ఓటు వేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలంటూ ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికుల కోసం అదనపు బస్సులు పెట్టాలన్నారు. మన రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి జిల్లాలకు అదనంగా బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఓటు వేసేందుకు వస్తున్న ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

బస్సుల ఏర్పాటులో ఏపీఎస్​ఆర్టీసీ విఫలం - ప్రయాణికుల ఇబ్బందులు - passengers problems in ap

Nadendla Manohar on APS RTC: సీఎం జగన్‌ సభలకు ఆగమేఘాలపై బస్సులు సమకూర్చే ఆర్టీసీ అధికారులు సాధారణ ప్రయాణికుల సమస్యలను పట్టించుకోవడం లేదని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Jana Sena PAC Chairman Nadendla Manohar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు స్వస్థలాలకు వస్తున్న ఏపీ ప్రజల కోసం అవసరమైన బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు వెళ్లిన రాష్ట్ర ప్రజలు ఓటు వేయాలనే బాధ్యతతో తమ తమ స్వస్థలాలకు వస్తున్నారని వారికి అవసరమైన బస్సులు ఏర్పాటు చేయడం ఆర్టీసీ అధికారుల కనీస బాధ్యత అని అన్నారు.

జగన్​కు దారుణ పరాభవం - ఆ మంత్రి గెలిచినా టీడీపీలోకి వెళ్తాడు - పీకే మరో సంచలన ఇంటర్వ్యూ - Prashant kishor on ap elections

ఈ విషయాన్ని ముందుగా అంచనా వేయకుండా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం దురదృష్టకరమని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నగరాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వస్తున్న వారి ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులు తక్షణమే స్పందించి ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయాలని దానికి సంబంధించిన ఆదేశాలివ్వాలని నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

రాష్ట్రం బాట పట్టిన ఓటర్లు - హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ - TRAFFIC AT HYD VIJAYAWADA HIGHWAY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.