ETV Bharat / state

గుంతకల్లు రైల్వే కార్యాలయంలో సీబీఐ సోదాలు - అదుపులో 8 మంది - CBI arrested Guntakal Railway DRM

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 12:48 PM IST

Updated : Jul 6, 2024, 8:10 PM IST

Guntakal Railway DRM and DFM Officials Arrested by CBI : గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయంలో సీబీఐ సోదాలు ముగిసాయి. రైల్వే గుత్తేదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై డివిజినల్‌ రైల్వే మేనేజర్‌, ఫైనాన్స్‌ మేనేజర్‌లను సీబీఐ అదుపులోకి తీసుకుంది. మరికొంత మంది కార్యాలయ సిబ్బందిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది.

Guntakal Railway DRM and DFM Officials Arrested by CBI
Guntakal Railway DRM and DFM Officials Arrested by CBI (ETV Bharat)

Guntakal Railway DRM and DFM Officials Arrested by CBI : రైల్వే గుత్తేదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై గుంతకల్లు డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ వినీత్‌సింగ్‌, డివిజినల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ ప్రదీప్‌బాబును సీబీఐ అదుపులోకి తీసుకుంది. గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలో ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు కింద 500 కోట్ల రూపాయల వ్యయంతో రైలు వంతెనల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను గుత్తేదారుడు రమేష్‌తోపాటు మరో 11మంది దక్కించుకున్నారు. అయితే పనులకు అనుమతులు ఇచ్చేందుకు డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ డబ్బులు డిమాండ్‌ చేయడంతో గుత్తేదారు రమేష్‌తో పాటు మరికొందరు సీబీఐని ఆశ్రయించారు.

ముందుగానే వేసిన పథకం అనుగుణంగా గుత్తేదారు రమేష్ నుంచి లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అయితే గత మూడు రోజులుగా గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని పలు విభాగాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయం తలుపులు వేసి సిబ్బందిని విచారించారు. ఆర్థిక విభాగంలో పని చేస్తున్న సీనియర్‌ డివిజన్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ ప్రదీప్‌బాబు సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో డీఆర్ఎం వినీత్‌ సింగ్‌ ఇంట్లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఎం వినీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌-బెంగళూరు హైవే విస్తరణ - రాయలసీమకు మహర్దశ - Hyderabad Bangalore Highway

డీఆర్ఎం కార్యాలయ సిబ్బంది రాజు, ప్రసాద్, బాలాజీని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి కుటుంబసభ్యులను పిలిపించి వివరాలు తెలిపారు. అనంతరం అదుపులోకి తీసుకున్న వారిని వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే వీరిని సీబీఐ కోర్టుకు తరలించడానికి డీఆర్ఎం కార్యాలయం వద్ద సీబీఐ అధికారులు ఆరు వాహనాలను సిద్ధం చేశారు. సీబీఐ కోర్టుకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో డీఆర్ఎం కార్యాలయం వద్దకు కార్యాలయ సిబ్బంది, బంధువులు భారీగా చేరుకున్నారు.

గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయంలో భాగమైన ఆర్థిక విభాగంలో సికింద్రాబాద్‌కు చెందిన సీబీఐ అధికారులు ఈ దాడులు చేశారు. ఆర్థిక విభాగంలో పని చేస్తున్న సీనియర్‌ డివిజన్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌(డీఎఫ్‌ఎం) ప్రదీప్‌బాబుతో పాటు మరికొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు గత మూడు రోజుల నుంచి గుంతకల్లులో మకాం వేశారు.

ముగిసిన వారాహి దీక్ష - చాతుర్మాస దీక్ష చేపట్టనున్న పవన్‌ కల్యాణ్‌ - Deputy CM Pawan Kalyan

ఏపీఎస్‌ఆర్టీసీ కష్టాలు తీరేనా - ఉమ్మడి ఆస్తుల్లో వాటా దక్కేనా - APSRTC Losses State Bifurcation

Last Updated : Jul 6, 2024, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.