ETV Bharat / state

విజృంభిస్తున్న 'మహమ్మారి' - మీలో ఈ లక్షణాలు ఉన్నాయా - జాగ్రత్త పడండి

రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్‌ మహమ్మారి - నిర్ధారణ పరీక్షలతో త్వరగా కోలుకునే అవకాశం

How To Find Cancer
How To Find Cancer (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 5:18 PM IST

How To Find Cancer : క్యాన్సర్‌ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. జీవన శైలిలో మార్పులు, ఆహారంలో పోషకాల లేమి, వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో అనేక మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. అందుకే ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. నవంబర్‌లో అసాంక్రమిక వ్యాధుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జాతీయ స్థాయి కార్యక్రమానికి (APNCD) శ్రీకారం చుట్టింది.

క్యాన్సర్‌పై నిర్లక్ష్యం, అవగాహన లేమి : తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మారుమూల గ్రామాల్లో స్వీకార్‌ వైద్యులు, స్విమ్స్‌ ఏర్పాటు చేసిన పింక్‌ బస్సులు ఉచితంగా స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. స్వీకార్‌ 48,000 పరీక్షలు నిర్వహించారు. స్విమ్స్‌ ఈ ఏడాదిలోనే 9,584 మందిని పరీక్షించింది. అనుమానితులను గుర్తించి తదుపరి చికిత్సలు అందిస్తున్నారు. కేసులు తక్కువ నమోదు అయిన ప్రజల్లో క్యాన్సర్‌పై నిర్లక్ష్యం, అవగాహన లేమి స్పష్టంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోది.

ప్రభుత్వ చర్యలు ఇలా : ఏపీఎన్‌సీడీ సర్వే కోసం జిల్లాలో 9 వందల మందికి పైగా మెడికల్‌ అధికారులు, సీహెచ్‌వోలు, సిబ్బందికి రెండు నెలల కిందటే శిక్షణను ఇచ్చారు. వీరు వారానికి 45 మందిని సర్వే చేయనున్నారు. ఆ వివరాలు 'ఈ-బ్యాక్‌' అనే ఆన్‌లైన్‌ సైట్‌లో పొందుపరచనున్నారు. షుగర్, బీపీ, క్యాన్సర్‌ వంటి వాటి గురించి ముందుస్తుగా ఏఎన్‌ఎంలు అవగాహన కల్పిస్తారు. దానితో పాటు మెడికల్‌ అధికారులు, సీహెచ్‌వోలు కలిసి ఇంటింటి సర్వే నిర్వహిస్తారు.

ఛాతీ అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు - ఈ జాగ్రత్తలు మేలంటున్న నిపుణులు!

సీహెచ్‌ల్లో 'వయా' పరీక్షల ద్వారా అనుమానితులను గుర్తిస్తారు. రుయాలోని క్యాన్సర్‌ నివారణ విభాగానికి పంపిస్తారు. త్వరలో ఈ విభాగం ప్రారంభం కానుంది. ప్రధానంగా ఈ సర్వే 18 సంవత్సరం పైబడిన వాళ్లందరికీ తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 30 సంవత్సారాలు పైబడిన స్త్రీలందరికీ తప్పనిసరిగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరు క్యాన్సర్‌ ముప్పు బారినపడే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

క్యాన్సర్‌ లక్షణాలు : అతిగా బరువు తగ్గడం, విపరీతమైన అలసట, తరచూ జ్వరం, మలంలో రక్తస్రావం, శరీరంలో మార్పులు, రక్తహీనత, గాయాలు త్వరగా మానకపోవడం, మింగలేకపోవడం, శరీర భాగం గట్టిగా మారడం, వీడని దగ్గు వంటి లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

"క్యాన్సర్‌ మీద అవగాహన లేక రోగం ముదిరే వరకు గుర్తించడం లేదు. మహిళల్లో రొమ్ము కాన్సర్‌ను గుర్తించేందుకు ఇప్పటికే ఏఎన్‌ఎంలు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. ఆదిలోని గుర్తించి రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా ఇది అంటువ్యాధి కాదనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి. నిత్య వ్యాయామం, సరైన తిండి, కంటికి నిద్ర అలవాటు చేసుకోవాలి."- డా.పద్మావతి, ఏపీఎన్‌సీడీ తిరుపతి జిల్లా ప్రోగ్రాం అధికారిణి

అలర్ట్ : అన్నం తింటూ చేసే ఈ ఒక్క పనివల్ల - క్యాన్సర్​ ముప్పు 41 శాతం పెరుగుతుందట! - Salt and Gastric Cancer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.