ETV Bharat / state

ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య - నాలుగేళ్ల తర్వాత కాల్​ లెటర్ - Call Letter to Dead Youth

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 3:45 PM IST

Call Letter for Last Test of a Job to Died Young Man in Mancherial: ఓ అభ్యర్థికి చనిపోయిన నాలుగేళ్ల తర్వాత ఉద్యోగ చివరి పరీక్షకు హాజరు కావాలని కాల్​ లెటర్​ వచ్చింది. ఉద్యోగం రాలేదని ఆ యువకుడు గతంలో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలపగా, పోస్ట్​మెన్​ ఆ లెటర్​ను తిరిగి వెనక్కి పంపించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

call_letter_to_dead_youth
call_letter_to_dead_youth (ETV Bharat)

Call Letter for Last Test of a Job to Died Young Man in Mancherial : ప్రతి వ్యక్తి జీవితంలో ఒక విషాధ గాథ దాగి ఉంటుంది. ఒకప్పుడు ఉద్యోగం కోసం ఓ యువకుడు తీవ్రంగా కృషి చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్​ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తాను బతికి ఉన్నప్పుడు అప్లై చేసిన ఓ ఉద్యోగానికి, నాలుగేళ్ల తర్వాత చివరి పరీక్షకు హాజరుకావాలని కాల్​ లెటర్​ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని మందమర్రి గ్రామానికి చెందిన సిద్దెంకి మొండయ్య, సరోజ దంపతులకు నవీన్ కుమార్, అనూష, ఆదిత్య, జీవన కుమార్ సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు. వారిలో ఒకరైన జీవన్ కుమార్ (24) 2014లో ఐటీఐ పూర్తి చేశారు. 2018లో నార్తర్న్​ పవర్​ డిస్ట్రిబ్యూషన్​ లిమిటెడ్​లో జూనియర్​ లైన్​మెన్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ జారీ కాగా, ఆ యువకుడు అప్లై చేసుకున్నాడు. పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూశాడు. అనారోగ్యంతో అక్క ఆదిత్య (2018లో), తల్లి సరోజ (జనవరి, 2019లో) మరణించారు. ఎంత ఎదురు చూసినా ఉద్యోగం రాకపోవడం, కుటుంబ సమస్యలు పెరగడంతో జీవన్ కుమార్ 2020 మార్చి 15న ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం అక్క అనూష, తండ్రి మొండయ్య చనిపోయారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు నవీన్ ఒక్కరే ఉన్నారు.

స్కేటింగ్ చేస్తూ వివిధ రకాలు విన్యాసాలతో వారెవ్వా అనిపించిన చిన్నారి ధన్విక - 7 Year Old Skateboarder Girl

NPDC Exam Call Letter Died Person : ఎన్​పీడీసీఎల్​ సంస్థ రాత పరీక్ష మెరిట్ లిస్ట్​ ఆధారంగా అభ్యర్థులను పిలిచింది. అనంతరం కొన్ని కారణాలతో ఆ నోటిఫికేషన్​లో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదు. దీంతో మిగులు పోస్టులు భర్తీ విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెరిట్​ ప్రకారం నియామకాలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆ సంస్థ మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మెరిట్​ లిస్ట్​ ప్రిపేర్​ చేసి అభ్యర్థులను చివరి పరీక్ష అయిన స్తంభాలు ఎక్కే ఎగ్జామ్​కు మెరిట్​ జాబితా సిద్దం చేసింది. అందులో జీవన్ కుమార్ పేరు ఉంది. దీంతో చివరి పరీక్షకు రావాలని పోస్ట్​ ద్వారా కాల్​ లెటర్​ వచ్చింది. ఆ యువకుడు చనిపోయి నాలుగు సంవత్సరాలు అయిందని తెలుసుకున్న పోస్ట్​మ్యాన్​ తిరిగి వెనక్కి పంపించాడు.

వైఎస్సార్సీపీ అక్రమ నిర్మాణాలు - కూల్చివేసిన సీఆర్డీఏ అధికారులు - YSRCP Office Demolished

వీఎంఆర్డీఏలో వైఎస్సార్సీపీ భక్తుల నిర్వాకాలు- పనులు పూర్తయ్యాక పర్మిషన్లు! - YSRCP illegal offices at Yendada

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.