Brutal Murders in Kakinada District : రోజురోజుకూ మనుషులు ఎంతో కృూరంగా మారుతున్నారడానికి నిదర్శనంగా చాలా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఆస్తి కోసం తోబుట్టువులనే చంపేసిన ఘటనలు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తల్లి దండ్రులను కడతేర్చిన దారుణాలు, ప్రేమ పేరుతో ఉన్మాదాలు, పాత కక్షలంటూ ప్రాణాలు తీయడం, , వర్గ పోరులని గొడవలు ఇలా ఏదో ఒక నెపంతోనో, అత్యాశతోనో తోటివారి ప్రాణాలు తీయడం సాధారణమయ్యింది. క్షణికావేశంలో జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కాకినాడ జిల్లా కాజులూరులో జరిగింది.
కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో రెండు కుటుంబాల మధ్య భగ్గుమన్న ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు హతమయ్యారు. శలపాక చిన్నపేటలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో బత్తుల రమేష్, బత్తుల చిన్నా, బత్తుల రాజాను పొట్లకాయల నాగేశ్వరావుతోపాటు మరో నలుగురు విచక్షణా రహితంగా నరికేశారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతుల్లో అన్నదమ్ములతో పాటు కొడుకు కూడా ఉన్నారు.
తండ్రిని నరికి చంపిన కొడుకు - ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్
మృతుల భార్యలు గల్ఫ్‌లో పని చేస్తున్నారు. గొల్లపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో శలపాక గ్రామంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ రఘువీర్‌విష్ణు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యలు జరిగిన వెంటనే భయంతో స్థానికులు తలుపులు గడియపెట్టి లోపలే ఉండిపోగా పోలీసులు బయటకు రప్పించి విచారించారు. నిందితులు పొట్లకాయల నాగేశ్వరరావు, బేబీతో పాటు మరో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. శలపాక గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
కడివేడులో మరో దారుణం..
Murder in Tirupati District : తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడులో దారుణ హత్య జరిగింది. వెంకటేష్ అనే యువకుడి కళ్లలో కారం కొట్టి కర్రలు, రాడ్లతో దాడి చేసి చంపారు. పాతకక్షలే గొడవలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. విచక్షణా రహితంగా దాడి చేయడం వల్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ఏడాదిన్నర క్రితం హత్య- మందు బాటిల్ సాక్ష్యం- రెండు కేసుల్లో నిందితుడు ఒకరే