ETV Bharat / state

మల్లారెడ్డా మజాకా - స్టెప్పులతో అదరగొట్టారు - MALLA REDDY DANCE

మనవరాలి పెళ్లి సంగీత్‌లో తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు - నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియోలు

Malla_Reddy_Dance
MALLA REDDY DANCE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 4:34 PM IST

MALLA REDDY DANCE: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్​ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు తెలియన వారు ఉండరేమో. ఆయన స్పీచ్​లకు, డ్యాన్సులకు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆయన స్పీచ్ ఇచ్చారంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, మల్లరెడ్డి పేరు వార్తల్లో నిలవాల్సిందే. తాజాగా మల్లారెడ్డి మరోసారి మాస్ డ్యాన్స్​తో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇంతకీ ఆయన ఎందుకు డ్యాన్స్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

తన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం ఈ నెల 27వ తేదీన జరగనుంది. దీంతో ప్రస్తుతం పెళ్లికి ముందు జరిగే పలు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు హాజరైన ఈ వేడుకలో మల్లారెడ్డే స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. తన మనవరాలి పెళ్లి సంగీత్‌లో స్టెప్పులు వేసి తనకు తానే సాటి అనిపించుకున్నారు మల్లారెడ్డి.

కొరియోగ్రాఫర్స్‌తో శిక్షణ తీసుకుని మరీ: ఏదైనా సరే పర్ఫెక్ట్​గా చేసే మల్లారెడ్డి దీనిని కూడా అలాగే చేయాలి అనుకున్నారు. దీనికోసం కొరియోగ్రాఫర్స్‌తో శిక్షణ తీసుకుని మరీ డ్యాన్స్‌లో ప్రత్యేక స్టెప్పులు వేసి అదరగొట్టారు. సంగీత్​కి వచ్చిన అతిథులకు, బంధుమిత్రులకు తన డ్యాన్స్​తో ఉల్లాసాన్ని నింపారు.

కుర్ర హీరోలకు గడ్డి పోటీ ఇచ్చేలా: 71 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే క్యాస్టూమ్స్​ ధరించిన మల్లారెడ్డి, స్టేజ్​పై నాటు నాటు పాటకు ఊరమాస్ స్టెప్పులేశారు. కొరియోగ్రాఫర్లు, మనవళ్లతో, వారికి ఏమాత్రం తగ్గకుండా డ్యాన్స్ ఇరగదీశారు. డీజే టిల్లు పాటకు, తాతా వస్తాడే అదరగొడ్డి పోతాడే పాటకు మల్లారెడ్డి వేసిన మూమెంట్స్ చూసి అక్కడున్న వారంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సమాజిక మాధ్యమంలో వైరల్​గా మారాయి. ఇది చూసిన వారంతా 'తాతా వస్తాడే అదరగొట్టి పోతాడే' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మల్లారెడ్డి డ్యాన్స్​ను మీకూ చూడాలి అని ఉంది కదా. పైన లింక్​పైన క్లిక్ చేసి ఓ లుక్కేయండి.

మల్లారెడ్డా మజాకా: మల్లారెడ్డి డ్యాన్స్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఏదైనా శుభకార్యానికో, లేదా ఏ సినిమా ఫంక్షన్​కో వెళ్లారంటే మల్లారెడ్డి డ్యాన్స్ చేయాల్సిందే. ఆ వేడుకలకు హాజరైన వారు అడిగి మరీ మల్లారెడ్డితో స్టెప్పులేయిస్తారు. ఆయన డ్యాన్స్​ వీడియోలకు ఫ్యాన్​ బేస్ అలా ఉంటది మరి. ఆ వీడియోలు చూసి కడుపుబ్బా నవ్వుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అందుకే మల్లారెడ్డి డ్యాన్స్ చేస్తే, ఆ వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

తెలంగాణ : బర్త్​డే పార్టీలో మంత్రి మల్లన్న విన్యాసాలు... నెట్టింట వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.