ETV Bharat / state

విద్యాసాగర్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు మద్దతు ఇస్తున్నారు: నటి కాదంబరీ - Bollywood Actress kadambari Issue

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 10:36 AM IST

Bollywood Actress kadambari Jethwani Issue Update : ముంబయికి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీపై అక్రమ కేసు వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆమె విజయవాడ పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. దర్యాప్తు అధికారి ఏసీపీ స్రవంతి రాయ్‌ని కలిసి పలు అంశాల గురించే ఫిర్యాదు చేశారు.

actress_kadambari_jethwani_issue_update
actress_kadambari_jethwani_issue_update (ETV Bharat)

Bollywood Actress kadambari Jethwani at Vijayawada Police Commissioner Office : ముంబయి నటి కాదంబరీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి వేధించిన వ్యవహారంలో నాటి సీపీ కాంతి రాణా, డీసీపీ విశాల్‌ గున్ని, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు కీలక వ్యక్తులు అని బాలీవుడ్‌ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు చేశారు. ఆమె గురువారం రాత్రి విజయవాడ పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. దర్యాప్తు అధికారి ఏసీపీ స్రవంతి రాయ్‌ను కలసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తన తల్లిదండ్రులను అరెస్టు చేశారని వాపోయారు.

Actress kadambari Jethwani Issue Update : విద్యాసాగర్‌తో పోలీసు ఉన్నతాధికారులు కుమ్మక్కై ఫోర్జరీ పత్రం సృష్టించి తప్పుడు కేసు నమోదు చేశారని కాదంబరి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకే ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కేసు నమోదు చేశారని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన వెంటనే ఆఘమేఘాలపై ముంబయి వచ్చి తనతో పాటు తల్లిదండ్రులనూ అరెస్టు చేయడం కుట్రలో భాగమే అన్నారు. పోలీసు కస్టడీలో తనను ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు సుదీర్ఘంగా విచారించారనీ, ముంబయిలో కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారని ఆరోపించారు. విద్యాసాగర్‌ను వెంటనే అరెస్టు చేసి, తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు.

ఆ ముగ్గురూ కీలకంగా వ్యవహరించారు - ఇంటివద్ద రెక్కీ చేశారు: ముంబయి నటి - MUMBAI ACTRESS CASE

వైఎస్సార్సీపీ ఎందుకు మద్దతిస్తోంది? : కమిషనర్‌ కార్యాలయం వెలుపల కాదంబరి మీడియాతో మాట్లాడారు ‘17 క్రిమినల్‌ కేసులు ఉన్న కుక్కల విద్యాసాగర్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారో అర్థం కావడం లేదు. అటువంటి వ్యక్తి నాపై ఆరోపణలు చేయడం తగదు. నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేసి పబ్బం గడుపుకోవాలని విద్యాసాగర్‌ చూస్తున్నారు. ఇటువంటి దారుణ పరిస్థితుల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని కోరుకుంటున్నా. దీనికి రాజకీయ రంగు పులమడం అన్యాయం. కొందరు పోలీసు ఉన్నతాధికారులు పరిధి దాటి వ్యవహరించడంతో వారిపై ఫిర్యాదు ఇచ్చా. పోలీసు కమిషనర్‌ త్వరితగతిన కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. నన్ను అరెస్టు చేసిన సమయంలో 10 ఎలక్ట్రానిక్‌ పరికరాలను పోలీసులు సీజ్‌ చేశారు. వాటిలో చాలా ఆధారాలున్నాయి. ఇంతవరకు వాటిని తిరిగి ఇవ్వలేదు’ అని ఆమె చెప్పారు.

క్రైమ్‌ థ్రిల్లర్‌ను మరిపిస్తోన్న ముంబయి నటి రియల్ స్టోరీ- సినీ విలన్లను తలదన్నేలా ఏపీ ఒరిజినల్‌ క్యారెక్టర్లు - What Happened in Heroine Incident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.