ETV Bharat / state

దేశ భవిష్యత్​ యువ ఓటర్లపైనే ఆధారపడి ఉంది: పురంధేశ్వరి

BJP Purandheswari on National Voters Day: యువత దేశం కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం ఆలోచించి మంచి నాయకులను తమ ఓటు ద్వారా ఎన్నుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సూచించారు. కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి హాజరై యువతకు ఓటు హక్కు గురించి తెలియజేశారు.

purandheswari_on_voters_day
purandheswari_on_voters_day
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 7:59 PM IST

BJP Purandheswari on National Voters Day: దేశ భవిష్యత్తు యువ ఓటర్లపైనే ఆధార పడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని అన్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో పురందేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనకు లభించిన ఓటు హక్కు ఎంతో శక్తివంతమైన ఆయుధమని అన్నారు. యువత దేశం కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం ఆలోచించి మంచి నాయకులను తమ ఓటు ద్వారా ఎన్నుకోవాలని సూచించారు. యువత ఓటు హక్కు 2024 ఎన్నికల్లో దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుందన్నారు. యువతకు జాతీయ భావాలు ముఖ్యమన్నారు.

దొంగ ఓటర్ల చేర్పు - నకిలీ ఓటర్ కార్డులు ప్రింట్ చేస్తోన్న జగన్​ సర్కార్ : పురందేశ్వరి

అంతర్జాతీయ స్థాయిలో నేడు దేశానికి ఉన్న ప్రతిష్ట ప్రధాని మోదr వలనే సాధ్యమయిందన్నారు. దేశంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో సాంస్కృతిక, ఆర్ధిక అభివృద్దికి కట్టుబడి మోదీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. భారత పౌరులు గర్వించే విధంగా దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి మోదీ అనునిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. నరేంద్ర మోదీ కృషితో అయోధ్యలో బాలరాముడికి ఐదు వందల సంవత్సరాల తరువాత ప్రాణ ప్రతిష్ట జరిగిందని గుర్తు చేశారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేవిధంగా నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డాలు దేశం కోసం పాటు పడుతున్నారని అన్నారు.

అరకులో అయోధ్య రామయ్య అక్షింతల పంపిణీ - మహాభాగ్యమన్న పురందేశ్వరి

ఇటువంటి నాయకత్వం ఎల్లవేళలా దేశానికి అవసరమని సరైన సమయంలో మనకు సరైన నాయకత్వం ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద ప్రసంగాలతో యువత స్పూర్తి పొందాలని సూచించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో మొట్ట మొదటి సారి 1952లో ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. నాటి ఎన్నికలకు భారత ఎన్నికల కమీషన్​కు ముఖ్య ఎన్నికల అధికారిగా సుకుమార్ సేన్ వ్యవహరించారన్నారు. దేశ వ్యాప్తంగా 35 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అందుకు గాను 62 కోట్లు బ్యాలెట్ పత్రాలు అవసరమయ్యాయని అన్నారు. నాడు దేశంలో అక్షరాస్యత 32శాతం ఉండగా 78 శాతం పోలింగ్ జరిగిందన్నారు. అయితే ఇప్పుడు అక్షరాస్యత శాతం పెరిగింది కానీ పోలింగ్ శాతం మాత్రం 51.52 శాతానికి పడిపోయిందన్నారు.

BJP Purandheswari 'సీమ రైతులు, యువతను మోసం చేసిన ప్రభుత్వమిది! పొత్తులు ఢిల్లీ పెద్దలు చూసుకుంటారు! '

140 కోట్లు జనాభా ఉన్న మన దేశంలో సగానికి పైగా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. గతంలో నీతివంతమయిన రాజకీయాలు ఉండేవని కానీ నేడు రాజకీయ వ్యవస్థ కలుషితమయిందన్నారు. 2024లో ఎన్నికల ప్రక్రియ 30 రోజుల్లో పూర్తి కానుందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచిన ఘనత ప్రధాని మోదీదే అని పురందేశ్వరి అన్నారు. దిగుమతులు తగ్గించుకుని, ఎగుమతులు పెంచుకోవడానికి వివిధ రకాల కార్యక్రమాలు ప్రధానమంత్రి అమలు చేస్తున్న విషయం విద్యార్థులకు వివరించారు.
యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఇంక్యుబేటర్ ల్యాబ్​ను పురందేశ్వరి పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.