Bar Bumper Offer to Liquor Drinkers on Diwali Gift : సాధారణంగా పండగ వేళ మద్యం దుకాణాలకు మందు బాబులు బారులుదీరుతుంటారు. అలాంటి వారికి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. ఇంక వారు ఆగుతారా ఆ బార్‌కు మద్యం కోసం ఎగబడుతున్నారు. మందు బాబులకు దీపావళి కానుకగా అన్నమయ్య జిల్లాలో ఓ బార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే రాజంపేటలో మందు ప్రియులకు తిరుమల బారు కిక్కు ఇచ్చే దివాళీ బోనాంజ ప్రకటించింది. కేవలం మద్యం బాటిల్ కొనండి సర్వం మేమే సమకూరుస్తాం అంటూ ప్రకటిస్తూ బ్యానర్లు వేసింది. మద్యం బాటిల్ కొనుక్కుంటే ఒక గుడ్డు, గ్లాసు, వాటర్ ప్యాకెట్ ఉచితమని ఆఫర్ ప్రకటించారు. ఈ సందర్భంగా తిరుమల బార్ యాజమాన్యం బ్యానర్ వేయడంతో చూసే వాళ్లు అవాక్కయ్యారు. ప్రజలు ఇది ఎక్కడ విడ్డూరమని నోరు వెళ్లబెట్టారు. ఏది ఏమైనప్పటికీ మందు బాబులకు దీపావళి పండుగ ఒక రోజు ముందుగానే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు.
ఉచిత గ్యాస్ పథకం - పెట్రోలియం సంస్థలకు చెక్కు అందజేసిన సీఎం
కర్నూలు మార్కెట్లో ఉల్లి గుట్టలు - కిలో 15రూపాయలే! - తీవ్రంగా నష్టపోతున్న రైతులు