Devaragattu fair : దేవరగట్టు ఆధ్యాత్మిక సంప్రదాయ సంబరాలకు సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా హొళగుంద మండల పరిధిలోని దేవరగట్టులో వెలసిన మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్ర ఈ నెల 12వ తేదీన నిర్వహించనుండగా ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు లక్షాలాదిగా తరలి రానున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని సౌకర్యాలు సమకూర్చేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే దేవరగట్టుకు వెళ్లే మార్గంలో రహదారి మరమ్మతులు, గట్టుపై విద్యుత్తు సమస్య తలెత్తకుండా అదనంగా ట్రాన్స్ఫార్మర్లు బిగించారు. అనుమానితుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు సుమారు 250కి పైగా సీసీ కెమెరాలు బిగిస్తున్నారు.
50 పడకల వైద్యశాల
ఉత్సవంలో భాగంగా జరిగే కర్రల సమరంలో పాల్గొనేందుకు భక్తులు పోటీపడుతుంటారు. ఈ ఘటనలో గాయపడే వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా సుమారు 30 నుంచి 50 మంచాలతో తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేశారు. ప్రథమ చికిత్స సామగ్రి, మందులు, 108 వాహనాలు రెండు నుంచి నాలుగు వాహనాలు ఉండేందుకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు ఆలూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య సిబ్బందితో పాటు జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక సిబ్బంది సేవలు అందించనున్నారు.
నిరంతరం తాగునీటి సరఫరా
ఉత్సవంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. లోపించకుండా హొళగుంద, ఆలూరు, హాలహర్వి మండలాలకు చెందిన మండల స్థాయి, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక సిబ్బంది ఎప్పటికప్పుడు పనులు చేపట్టేలా ముందస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులకు నిరంతరం తాగునీరు సరఫరా అయ్యేలా చూస్తామని గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇక చీకట్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా కొండ చుట్టూ విద్యుత్తు సౌకర్యం కల్పించామని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ఎలాంటి కోతలు కలగకుండా ఆలూరు సబ్ డివిజన్‌లో సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.
ఆలూరు సమీపంలోని దేవరగట్టు కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో మాళమ్మ, మల్లేశ్వరస్వామి కొలువుదీరారు. దసరా రోజున అర్ధరాత్రి 12గంటలకు కల్యాణమహోత్సవం ఉంటుంది. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఊరేగింపు ఉంటుంది. ఈ సందర్భంగా పాదాలగుట్ట, రక్షపడ, శమీవృక్షం, బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో జరిగే ఊరేగింపులో ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం మొత్తం 8 గ్రామాల ప్రజలు పోరాడుతారు. 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా కర్రలతో తలపడటానే బన్ని ఉత్సవం అని పిలుస్తారు.
Devaragattu Banni Festival Celebrations: దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ప్రమాదం.. మూడుకు చేరిన మృతుల సంఖ్య