ETV Bharat / state

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా - 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం - Auto overturned 25 Injured - AUTO OVERTURNED 25 INJURED

Auto overturned 25 Injured Road Accidents in Andhra Pradesh : ప్రమాదం చెప్పి రాదు. కానీ జాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల మన ఒక్కరి ప్రాణమే కాదు తోటి ప్రయాణికులు క్షేమంగా ప్రయాణించగలుగుతారు. కానీ తప్పు ఎవరిదైనా, లోపం ఎక్కడ ఉన్నా రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. కేవలం ఒక్క రోజులోనే రాష్ట్రంలో పలు చోట్ల ప్రమాద ఘంటికలు మోగాయి.

auto_overturned_25_injured_road_accidents_in_andhra_pradesh

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 5:59 PM IST

Updated : Mar 31, 2024, 8:57 AM IST

Auto overturned 25 Injured Road Accidents in Andhra Pradesh : కారణాలేవైనప్పటికీ రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో రోడ్లు రక్తమోడుతున్నాయి. బాధిత ప్రజలు అవిటితనంతో బతుకీడుస్తున్నారు. అతివేగం కారణంగా కొన్ని ప్రమాదాలు జరిగితే టైర్లు పేలి, డ్రైవర్ల నిర్లక్షం, రోడ్డు నియమాలు పాటించకపోవడం, కొన్ని ప్రాంతాల్లో రహదారి సరిగ్గా లేక ప్రమాదాలు ఎక్కువవుతూనే ఉన్నాయి. అయినా అతి వేగాన్ని మానుకోవడం లేదు కొందరు. ఏ విధంగా అయినా ప్రతీ రోజు ఒక్క ఘటన అయినా జరుగుతూనే ఉంది.

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా - 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం

విద్యుత్ వైర్లు తగిలి లారీ దగ్ధం- అప్రమత్తమైన డ్రైవర్​ - Fire Accident in Lorry in Kurnool

Auto overturned in Kurnool District : కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో కూలీలతో మిరప కోతలకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో 20 మందికి గాయాలు కాగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హులేబీడు గ్రామానికి చెందిన కూలీలు చెప్పిగిరి మండలంలోని బంటనహల్, ఏరూరు, డేగులపాడు గ్రామాల్లో మిరప కోతలకు వెళ్తుంటారు. రోజులాగే ఉదయం పనులుకు వెళ్లి పనులు చేసి తిరిగి వస్తుండుగా హత్తి బెలగల్ గ్రామ సమీపంలో ట్రాలీ ఆటో టైర్ పగిలి ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఈరోజు ఆదోని ప్రైవేట్​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దస్తగిరమ్మ మృతి చెందగా, కర్నూలు ఆస్పత్రిలో శేకమ్మ కన్నుమూసింది. బాధితులకు ఆలూరు, ఆదోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.

ట్రాఫిక్​లో లారీ బ్రేకులు ఫెయిల్- వరుసగా వాహనాలు ధ్వంసం - Lorry Accident Parawada Lankepalem

ఉదయం ఆదోని బైపాస్ నిర్మాణ పనులకు మట్టి తరలిస్తుండగా టిప్పర్​కు విద్యుత్ వైర్లు (Electric Wires) తగిలి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది.

Car Hit Divider at West Godavari : పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామం వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. విజయవాడ నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో నలుగురు యువకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అతి వేగంగా ప్రయాణించడం వలనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

పెళ్లింట విషాదం - కారు బోల్తా పడి పెళ్లి కుమార్తె తల్లి సహా ముగ్గురు మృతి - ROAD ACCIDENTS

పరవాడ- లంకెలపాలెం జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం గాజువాక నుంచి వస్తున్న బొగ్గు లారీ లంకెలపాలెం సిగ్నల్ పాయింట్ వచ్చే సరికి బ్రేకులు తప్పడంతో ముందున్న వాహనాలను ఢీ కొట్టింది. దీంతో వరుసగా మూడు వాహనాలు ఒక దాని వెంట మరొకటి ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

ఆటో, లారీ ఢీ- పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- అక్కడికక్కడే 9మంది మృతి

Last Updated : Mar 31, 2024, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.