ETV Bharat / state

సీఎం, డిప్యూటీ సీఎంతో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ భేటీ - పెట్టుబడులపై చర్చ - Philip Green met CM and Deputy CM

Australian High Commissioner met CM and Deputy CM: పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​తో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

philip_green_met_cm_and_deputy_cm
philip_green_met_cm_and_deputy_cm (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 10:32 PM IST

Australian High Commissioner met CM and Deputy CM: రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరిస్తూ పలు సంస్థలను రప్పించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి చర్యలు తీసుకుంటోంది. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపార దిగ్గజాలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు.

సీఎం చంద్రబాబుతో భేటీ: ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ సీఎం చంద్రబాబుతో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా వాణిజ్య సముదాయాన్ని ఆహ్వానిస్తున్నట్టు సీఎం ఎక్స్(ట్విట్టర్​)లో ట్వీట్ చేసారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య వ్యాపార అనుకూల ప్రభుత్వం ఉందని ఆస్ట్రేలియన్ హై కమిషనర్​కు తెలిపినట్టు సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు - బీపీసీఎల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు - CM met BPCL Representatives

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​తో భేటీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​తోనూ ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని పవన్ కల్యాణ్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్​ని పవన్ కల్యాణ్ సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియచేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చలో పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్ జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చర్ కౌన్సిలర్ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు.

Australia Consulate General Met CRDA Commissioner : ఇటీవల సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్​తో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సిలై జాకి, ఇతర ఆస్ట్రేలియా ప్రతినిధులు భేటి అయ్యారు. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టి ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలకు అమరావతిలో ఉన్న వాణిజ్య అవకాశాలపై సీఆర్డీఏ కమిషనర్‌తో కాన్సుల్‌ జనరల్‌ చర్చించారు.

టెస్లాతో ప్రభుత్వం సంప్రదింపులు - పెద్ద కంపెనీలకు అధికారుల లేఖలు - Tesla Management on Investments

అమరావతికి పూర్వవైభవం - పెట్టుబడులకు ఆస్ట్రేలియా ఆసక్తి - CONSULATES MEET CRDA COMMISSIONER

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.