ETV Bharat / state

సరస్వతి ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ ల్యాండ్ - నోటీసులు జారీ - ASSIGNED LANDS IN SARASWATI LANDS

పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ భూములు గుర్తింపు - మాచవరం మండలంలో 20 ఎకరాలు అసైన్డ్ భూమి కొన్నారన్న అధికారులు

assigned_lands_in_saraswati_lands
assigned_lands_in_saraswati_lands (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 7:01 PM IST

Assigned Lands Identification in Saraswati Power Industries Lands: పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలో 20 ఎకరాల అసైన్డ్ భూములు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కింద ఉన్నట్లు తేల్చారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యంతో పాటు అసైన్డ్ రైతులు, అమ్మకానికి సహకరించిన మధ్యవర్తులకు నోటీసులు జారీ చేశారు. గురజాల నియోజకవర్గం పరిధిలోని మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 15 వందల ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం అప్పట్లో వైఎస్ ప్రభుత్వం కేటాయించింది.

ఇందులో అసైన్డ్ భూములు, అటవి భూములతో పాటు సహజ వనరులు కూడా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించారు. రెవిన్యూ, అటవిశాఖల అధికారులతో సర్వే కూడా చేయించారు. అధికారులు జరిపిన పరిశీలనలో 20 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల నుంచి సరస్వతి సంస్థ కొనుగోలు చేసినట్లు తేలింది. చట్టప్రకారం అసైన్డ్ భూములు అమ్మటానికి, కొనటానికి వీల్లేదు. అయినప్పటికీ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి సంస్థ వాటిని కొనుగోలు చేసింది. అందుకే రైతుల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. రైతులను బెదిరించి ఏమైనా భూములు కొన్నారా అనే కోణంలో విచారణ సాగుతోంది.

'విడదల రజిని హింసించారు' - స్టేషన్​లో వేధింపులపై ఫిర్యాదు

రా రా కూర్చో-మనల్ని ఎవడ్రా ఆపేది - పోలీస్ స్టేషన్​లో మేనల్లుడితో బోరుగడ్డ ముచ్చట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.