AS Raja Blood Bank Stands by People of Visakhapatnam : విశాఖ ప్రజలకు ఎ.ఎస్. రాజా బ్లడ్ బ్యాంక్ సంస్థ ఆపన్న హస్తంగా ఉంది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ గుర్తింపు పొందిన ఈ సంస్థ ఎలాంటి లాభం ఆశించకుండా ప్రజలకు రక్తం అందిస్తూ ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర పురస్కారాలు కూడా పొందింది. ఎక్కువగా పేద, మధ్య తరగతి వర్గాలవారికి ప్రాధాన్యత ఇస్తుంది ఈ సంస్థ. కరోనా లాంటి సమయంలో రక్త కొరత లేకుండా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు.
పేద, మధ్య తరగతి వర్గాలవారికే మెుదటి ప్రాధాన్యత : విశాఖ రామ్‌నగర్‌లో అన్ని ప్రధాన పెద్ద ఆస్పత్రులు ఉన్న చోట ఏళ్ల తరబడి విశాఖ వాసులు కోసం పనిచేస్తున్న ఏకైక సంస్థ ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంకు. ముఖ్యంగా పేద మధ్య తరగతి వర్గాలవారికి ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఉంటుంది. బయట ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల తరహాలో కాకుండా ఎటువంటి లాభపేక్ష లేకుండా పనిచేస్తున్న సంస్థ ఇది. కేవలం రక్తం ఒకటే కాదు ప్లాస్మా, వైట్ సేల్స్ అందించి రోగుల ప్రాణాలు కాపాడుతున్న బ్లడ్ బ్యాంకు ఇది.
లాభపేక్ష లేకుండా ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న సంస్థ : కేవలం నగర వాసులకు రక్తం ఇవ్వడమే కాకుండా ప్రకృతి విపత్తుల సమయంలో ముందుకు వెళ్లి బాధితులకు సేవలు అందిస్తారు. పలు రైళ్లు ప్రమాదానికి గురైనప్పుడు ముందుగా ఆ ప్రాంతానికి చేరుకొని రక్తం ఇచ్చిన ఘనత ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంకు ట్రస్ట్దే. అలాగే వివిధ కళాశాలలో యువత ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రక్త నిల్వలను పెంచుతూ విశాఖలో అత్యవసర సమయంలో రక్తం అందించే సంజీవినిగా నిలుస్తోంది.
"అందరి సహకారంతో సుమారు 25 ఏళ్లుగా ఎ.ఎస్. రాజా బ్లడ్ బ్యాంక్‌ను నడుపుతున్నము. అత్యాధునిక పరికరాలు వినియోగిస్తూ సంస్థను నిర్వహిస్తున్నాము. వివిధ కళాశాలలో యువత ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని కష్టాలను అధిగమించి రక్త నిధి ట్రస్ట్ కొనసాగిస్తున్నాము. ఎల్లప్పుడూ రక్త నిల్వలను పెంచుతూ అత్యవసర సమయంలో రక్తం అందించే సంజీవినిగా ఈ బ్లడ్ బ్యాంక్ నిలుస్తోంది." - డా. సుగంధి, ఎ.ఎస్. రాజా బ్లడ్ బ్యాంకు డైరెక్టర్
అంతర్జాతీయ రెడ్ క్రాస్ గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంక్ : కరోనా లాంటి క్లిష్టమైన సందర్భంలో రక్త కొరత రావడం, ముఖ్యంగా ప్లాస్మాతో కరోనా వైద్య సేవలు అందించినప్పుడు ఎందరో పేదలకు ఉచితంగా ప్లాస్మాను ఈ బ్లడ్ బ్యాంక్ అందించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంకుకి గుర్తింపు వచ్చింది. విశాఖ వాసులకు రక్తం దొరకలేదనే మాటే రాకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తునట్టు ఎ.ఎస్. రాజా ట్రస్ట్ డైరెక్టర్ చెబుతున్నారు. అలాగే ప్రజల్లో ఛైతన్యం తీసుకొచ్చి రక్తదానం పెంచాలంటున్నారు.
వందోసారి రక్తదానం - 'మహర్షి' రాఘవను ఇంటికి పిలిచి చిరు సన్మానం! - Maharshi Raghava Chiranjeevi