ETV Bharat / state

కృష్ణా తీరాన డ్రోన్ల సందడి - రెండు రోజులపాటు సమ్మిట్​ - AMARAVATI DRONE SUMMIT 2024

అమరావతిని డ్రోన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేలా డ్రోన్ సమ్మిట్ నిర్వహణ

Amaravati Drone Summit 2024
Amaravati Drone Summit 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 8:44 AM IST

Amaravati Drone Summit 2024 : వినీలాకాశంలో కనువిందు చేసే విన్యాసాలు, శాస్త్ర సాంకేతికతకు సవాలు విసిరే ఆలోచనలు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, అన‌లిటిక‌ల్స్‌ స‌మ‌ర్థ వినియోగానికి బీజం వేసే నిర్ణయాలు ఇలా బహుళ ప్రయోజనాలను అందిపుచ్చుకునే డ్రోన్‌ సమ్మిట్‌కు అమరావతి సిద్ధమవుతోంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేపటి నుంచి రెండు రోజుల పాటు అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్-2024 నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసింది. పున్నమి ఘాట్‌ వద్ద 5,000ల పైగా డ్రోన్​లతో మెగా షో ప్రత్యేక ఆకర్షణ కానుంది.

డ్రోన్స్ సాంకేతికత వినియోగంలో ఏపీని దేశానికి రాజధానిగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. డ్రోన్స్ సాంకేతిక సౌల‌భ్యాన్ని స‌మ‌ర్థంగా వినియోగించుకుని ప‌లు దేశాలు అద్భుత‌మైన ఫ‌లితాలు సాధిస్తున్నాయి. ఆ విధానాన్ని సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు సర్కార్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇప్పటికే డ్రోన్‌ కార్పొరేష‌న్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం పాల‌న‌లో, విప‌త్తుల నిర్వహ‌ణ‌లో ప్రజ‌ల దైనందిన జీవితంలో డ్రోన్స్ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించుకుని స‌త్ఫలితాలు ఎలా సాధించాల‌నే దానిపై క‌స‌ర‌త్తులు చేసింది.

Drone Summit in Mangalagiri : ఇందులో భాగంగా 22, 23 తేదీల్లో అమ‌రావ‌తిలో రెండు రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్​-2024 జాతీయ స‌ద‌స్సు నిర్వహిస్తోంది. పున్నమి ఘాట్‌ వద్ద నిర్వహించే డ్రోన్‌ షోను ప్రజ‌లంద‌రూ విస్తృతంగా తిల‌కించ‌డానికి వీలుగా విజ‌య‌వాడ న‌గ‌రంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. 5 చోట్ల భారీ డిజిట‌ల్ తెర‌లు ఏర్పాటు చేసి డ్రోన్ షోని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. విజ‌య‌వాడలోని బెంజిసర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు రింగు, వార‌ధి, బ‌స్టాండు, ప్రకాశం బ్యారేజీల వ‌ద్ద ఈ డిజిట‌ల్ తెర‌లు ఏర్పాటు చేస్తున్నారు.

డ్రోన్ స‌మ్మిట్ విజ‌యవంతానికి యంత్రాంగం రేయింబ‌వ‌ళ్లు కృషి చేస్తోంది. మంగ‌ళ‌గిరి సీకే కన్వెన్షన్​లో 22వ తేదీ ఉద‌యం అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్​ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. సదస్సులో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు లోకేశ్, బీసీ జ‌నార్దన‌రెడ్డి పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం పున్నమి ఘాట్‌లో పెద్ద ఎత్తున డ్రోన్ షో, క్రాక‌ర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10 మంది డిప్యూటీ క‌లెక్టర్లకు ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక బాధ్యత‌లు అప్పగించారు. దాదాపు 300 మంది అధికారులు, సిబ్బంది ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటీవ‌ల వ‌ర‌ద‌ల్లో ప్రభుత్వం డ్రోన్స్​ను స‌మ‌ర్థవంతంగా వినియోగించుకుంది. సంక్షోభం నుంచి అవకాశాలు వెతికే సీఎం చంద్రబాబు ఆలోచనల్లో భాగంగా వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్యల్లో డ్రోన్స్ వినియోగానికి ఉన్న అవ‌కాశాన్ని ఏపీ సర్కార్ గుర్తించింది. ఈ రంగానికి మ‌రింత ఊత‌మిచ్చి ప్రోత్సహించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 5 ల‌క్షల ఉద్యోగావ‌కాశాలు ఈ రంగంలో క‌ల్పించ‌వచ్చని అంచ‌నా వేస్తోంది. అయితే వ్యూహాత్మకంగా ఈ రంగంలో ఎలా ఎద‌గాలి, దానికున్న అవ‌కాశాలు, ఎద‌రయ్యే స‌వాళ్లు, ప‌రిష్కార మార్గాలు ఏంటీ అనే అంశాల‌పై ఈ జాతీయ స‌ద‌స్సులో మేధావులు, సాంకేతిక నిపుణ‌ల‌తో చ‌ర్చలు జ‌ర‌ప‌నుంది. ముంబ‌యి, తిరుప‌తి, హైద‌రాబాద్ ఐఐటీల నుంచి నిపుణ‌ులు, డ్రోన్స్ రంగంలో అనుభవజ్ఞులను, దేశ‌, విదేశీ సాంకేతిక ప్రముఖుల‌ను స‌ద‌స్సుకు ఆహ్వానించింది.

హ్యాకథాన్ పోటీల నిర్వహణ : డ్రోన్స్ స‌మ్మిట్ సంద‌ర్భంగా ఔత్సాహికుల‌కు హ్యాక‌థాన్ పోటీ నిర్వహిస్తోంది. డ్రోన్స్ రంగానికి సంబంధించి కొన్ని రంగాల్లో ఔత్సాహికుల‌కు స‌వాళ్లు ఇవ్వడంతో, వారి ప్రతిపాద‌న‌ల‌ను ప‌రిశీలించ‌డం, త‌దిర‌త అంశాలు బేరీజు వేసుకుని అత్యుత్తమ హ్యాక‌థాన్‌ల‌కు ప్రథ‌మ బ‌హుమ‌తి రూ.3 ల‌క్షలు, ద్వితీయ బ‌హుమ‌తి రూ.2 ల‌క్షలు, తృతీయ బ‌హుమ‌తి రూ.1 ల‌క్ష అంద‌జేయ‌నున్నారు.

భార‌తదేశం ఆత్మనిర్భర్‌లో భాగంగా 2030 క‌ల్లా ప్రపంచంలో భార‌త్ డ్రోన్స్ త‌యారీకి ప్రధాన కేంద్రంగా ఎదిగేలా వ్యూహరచన చేస్తోంది. 14 రంగాల్లో డ్రోన్స్ ఉప‌యోగానికి, దేశంలో వీటి తయారీకి అపార అవ‌కాశాలున్నాయి. ఇండియాలోనూ డ్రోన్స్ ఉప‌యోగం ఇప్పుడిప్పుడే వేగంగా పెరుగుతోంది. 2030 నాటికి 98,000ల కోట్ల మేర డ్రోన్స్ త‌యారీ అవుతాయనే అంచ‌నాలున్నాయి. డ్రోన్స్ వినియోగ ఆవ‌శ్యక‌త‌ను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఏపీనీ దేశానికి డ్రోన్స్ క్యాపిట‌ల్‌గా మార్చాల‌ని ఆకాంక్షిస్తోంది.

భవితకు దిక్సూచిలా 'అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌' - నిపుణుల హర్షం

సరికొత్త డ్రోన్లు ఆవిష్కరించిన 'విజయవాడ' విద్యార్థులు - అమరావతి డ్రోన్ సమ్మిట్​కు సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.