ETV Bharat / state

పాడేరుకు పోదాం- ఎయిర్ బెలూన్​లో విహరిద్దాం!

అరకులోయలో పర్యాటక అభివృద్ధికి చర్యలు - హాట్ ఎయిర్ బెలూన్​ని ప్రారంభించిన పాడేరు ఐటీడీఏ పీవో

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Araku_Valley_Tourist_Attractions
Araku Valley Tourist Attractions (ETV Bharat)

Araku Valley Tourist Attractions: పాడేరు అందాలు నిత్యం పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తుంటాయి. అరకులోయ సొబగులు, వంజంగిలో మేఘాల సోయగాలు యాత్రికులను అబ్బురపరుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్ర ఊటీ అరకులోయకి కొత్త సొబగులు సమకూరుతున్నాయి. అరకులోయను సందర్శించే పర్యటకులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు వీలుగా పాడేరు ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ చొరవతో ఆంధ్ర ఊటీ అరకు లోయలోని పద్మాపురం ఉద్యానవనంలో సాహస వినోదాన్ని అందించేందుకు నూతనంగా హాట్ బెలూన్ ప్రారంభించారు.

అరకు లోయని ఏటా రెండు లక్షల మంది వరకు సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో అరకు లోయను మరింత విభిన్నంగా వినూత్నంగా చూపించాలనే ఉద్దేశంతో హాట్ బెలూన్​ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. అరకులోయలో పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు హాట్‌బెలూన్‌ ఉపయోగపడుతుందని అభిషేక్‌ చెప్పారు.

వీటితో పాటు పద్మాపురం ఉద్యానవనంలో రాత్రి 10 గంటల వరకూ సందర్శకులు ఉండేందుకు వీలుగా విద్యుత్ దీపాల వెలుగులను విస్తరించాలని నిర్ణయించామన్నారు. అదే విధంగా త్వరలోనే అరకు లోయలో పారా మోటర్ గ్లైడింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి విస్తృత చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, అరకు లోయను మరింతగా పర్యాటకులకు చేరువ చేసేందుకు నిర్ణయించామని ఐటీడీఏ పీవో వెల్లడించారు. ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న అరకులోయ హాట్ బెలూన్​తో మరింత శోభాయమానంగా ఉండనుంది. హార్ట్ బెలూన్​లో పర్యాటకుల విహరిస్తూ అరకులోయ ప్రకృతి అందాలను కనులారా వీక్షిస్తూ సరికొత్త అనుభవాన్ని పొందనున్నారు. హాట్ బెలూన్ పర్యాటకుల ఆదరాభిమానాలు చూరగుంటే అరకులోయ సిగలో మరో కలికితురాయి చేరినట్లు అవుతుంది.

అరకులో పర్యాటకులకు కొత్త అనుభూతి - త్వరలో పారాగ్లైడింగ్ - PARAGLIDING ARRANGEMENT IN ARAKU

అబ్బురపరుస్తున్న వంజంగి సోయగాలు: ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి కొండలు మేఘావృతమై పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వంజంగి కొండలపై శ్వేతవర్ణ సోయగాలు ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మంచు సోయగం పాలసముద్రాన్ని కల్పిస్తూ పర్యటకులను కట్టిపడేస్తోంది. చూపరులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలకు వంజంగి కొండలు కేరాఫ్​ అడ్రస్​గా నిలవడమే కాకుండా, అక్కడ ఉన్న సహజసిద్ధమైన అందాలు ప్రకృతి ప్రేమికులను స్వర్గంలో విహరిస్తున్నామా అనేలా మైమరపిస్తున్నాయి.

శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో వాతావరణంలో మార్పులతో, శ్వేతమయమైన మేఘాల సోయగాలు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సూర్యోదయాన ప్రకృతి రమణీయమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ, సెల్ఫీలు దిగుతూ యాత్రికులు మురిసిపోతున్నారు.

సినిమా గ్రాఫిక్స్​ను తలదన్నే ప్రకృతి అందాలు - అల్లూరి జిల్లాలో మంచుకొండలు చూస్తే 'వావ్' అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.