ETV Bharat / state

రాజధాని రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు - సీఆర్డీఏ మూడో విడత లాటరీ - AMARAVATI

APCRDA Alternative Plots E-lottery Third Phase: అమరావతిలోని రైతులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ చేపట్టిన ఈ-లాటరీకి రాజధాని రైతులు వరుసగా విముఖత చూపుతూనే ఉన్నారు. దీంతో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు మరోసారి ఈ-లాటరీ నిర్వహించనున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు ఈ-లాటరీ ప్రక్రియకు రైతులు గైర్హాజరయ్యారు.

APCRDA_Alternative_Plots_E-lottery_Third_Phase

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 12:14 PM IST

APCRDA Alternative Plots E-lottery Third Phase: రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపులో సీఆర్డీఏ ఈ-లాటరీ ప్రక్రియ ప్రకటనపై స్పందన లేకపోవటంతో మూడో విడత లాటరీ నిర్వహించేందుకు ప్రకటన జారీ చేసింది. గ్రామాల వారీగా నివాస, వాణిజ్య స్థలాలను కేటాయించేందుకు ఈ-లాటరీ ప్రక్రియ నిర్వహించేందుకు ప్రకటనలు జారీ చేస్తున్నా సీఆర్డీఏ వైఖరికి నిరసనగా దీనికి గైర్హాజరు అవుతున్నారు. దీంతో రాజధాని రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియకు మరోమారు సీఆర్డీఏ ప్రకటన జారీ చేసింది.

ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు: మూడో విడత ఈ- లాటరీకి మరో అవకాశం కల్పిస్తున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 5 నుంచి 8 తేదీ వరకూ రైతులు ప్రత్యామ్నాయ ప్లాట్లకు ఈ-లాటరీ కోసం మరో అవకాశం ఇస్తున్నట్టు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. నివాస, వాణిజ్య స్థలాల ప్లాట్లు తిరిగి ఇచ్చే ప్రక్రియకు రైతులు హాజరు కాకపోవటంతో ఈ-లాటరీ ప్రక్రియ వాయిదాలపై వాయిదాలు పడుతోంది.

గ్రామాలవారీగా ప్లాట్ల కేటాయింపునకు సీఆర్డీఏ ఈ-లాటరీ నిర్వహిస్తున్నా రాజధాని గ్రామాల రైతులు ఆ కార్యక్రమానికి గైర్హాజరు అవుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపునకు మూడో విడత ఈ-లాటరీ ప్రక్రియను సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తామని వెల్లడించింది.

సమ్మతి లేకుండా ప్లాట్ల కేటాయింపులపై అభ్యంతరం- లాటరీ విధానం ఆపేయాలంటున్న అమరావతి రైతులు

వివిధ గ్రామాలకు తేదీలను ప్రకచించిన సీఆర్డీఏ: గతంలో జరిగిన పొరబాట్లను సరిదిద్దటంతో పాటు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు కోసం చర్యలు చేపట్టినట్టు సీఆర్డీఏ తెలిపింది. రాజధాని ప్రాంతంలోని ఐనవోలు, నేలపాడు, శాఖమూరు, తూళ్లూరు, అనంతవరం గ్రామాలకు ఫిబ్రవరి 5 తేదీన, కురగల్లు, నెక్కల్లు, నిడమర్రు, గ్రామాలకు ఫిబ్రవరి 6 తేదీన, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, మందడం, కొండమరాజపాలెం గ్రామాలకు ఫిబ్రవరి 7వ తేదీన, నవులూరు, లింగాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల రైతులకు ఫిబ్రవరి 8వ తేదీన ఈ-లాటరీ ప్రక్రియ నిర్వహిస్తామని సీఆర్డీఏ తెలియచేసింది.

ఇప్పటికే పలుమార్లు వ్యతిరేకించిన రైతులు: అదే విధంగా శనివారం వెంకటపాలెం, రాయపూడి పరిధిలోని గ్రామాలకు నిర్వహించిన ఈ-లాటరీ ప్రక్రియం సైతం కోరం లేక వాయిదా పడింది. మరోవైపు రైతులు ఆందోళన చెందుతున్నట్టుగా మాస్టర్ ప్లాన్​లో ఎలాంటి మార్పులూ చేయలేదని, 16 గ్రామాల రైతులకు లేఆవుట్ ప్లాన్లు అందుబాటులో ఉంచుతున్నట్టు సీఆర్డీఏ ప్రకటనలో పేర్కొంది. సందేహాల నివృత్తి కోసం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో సంబంధిత గ్రామాల సిబ్బంది ఆదివారం రోజు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు ఈ-లాటరీకి అధికారులు ఏర్పాట్లు చేసినా రైతుల నుంచి వ్యతిరేకతే ఎదురవుతోంది.

అమరావతిపై జగన్ సర్కార్ మరో కుట్ర! - మాస్టర్​ ప్లాన్​ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.