APCC Chief YS Sharmila Comments on Jagan : జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారని వస్తున్న వార్తలు అబద్ధమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని.. పిల్ల కాలువలన్నీ ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని ఎద్దేవా చేశారు.
జగన్ ఎప్పటికి అధికారంలోకి రాలేరు : జగన్ వస్తే బాగుండు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. జగన్ మళ్లీ ఎందుకు రావాలో చెప్పాలని ప్రశ్నించారు. మళ్లీ రూ.10 లక్షల కోట్లు అప్పులు చేయడానికి రావాలా? అని నిలదీశారు. పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్లీ రావాలా? అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీయడానికి మళ్లీ రావాలా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోతుంటే కనీసం రిపేర్లు చేయలేదు, ఇందుకే జగన్ మళ్లీ రావాలా? అని నిలదీశారు. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మళ్లీ మోసం చేయడానికి రావాలా? అని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికి అధికారంలోకి రాలేరని షర్మిల స్పష్టం చేశారు. ఒక్కఛాన్స్ పేరిట ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఆమె విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చేశారని మళ్లీ జగన్ రావాలని ఆమె ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలి- మోసాలు ఆయనకు కొత్త కాదు: షర్మిల - YS SHARMILA TWEET
ఒక్క ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోండి : విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేయ్యలేదని ప్రశ్నించారు. భారీ మెజారిటీతో గెలిచి ఎందుకు ధైర్యం చేయలేదన్నారు. బొత్స అనే వాడు నిండు సభలో విజయమ్మను అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమయ్యిందని విమర్శించారు. ఇప్పుడు వచ్చిన ఒక్క ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోండని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నడపలేమని ఆస్పత్రులు అంటున్నాయని విమర్శించారు. సూదికి, దూదికి డబ్బుల్లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.
ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి : ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు పడ్డాయని గుర్తుచేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించక ఆస్పత్రులు అల్టిమేటం ఇచ్చాయని మండిపడ్డారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఆరోగ్యశ్రీకి నిధులు ఆపేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1,600 కోట్ల ఆరోగ్రశ్రీ బిల్లులను పెండింగ్ పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. అలాగే ఆస్పత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం చర్చలకు పిలవాలని షర్మిల డిమాండ్ చేశారు.
జగన్, అతని అనుచరుల అహంకారమే వైఎస్సార్సీపీ పతనానికి నాంది : వైఎస్ షర్మిల - YS Sharmila on YS Jagan
కాంగ్రెస్‌నే అంటారా? - వైఎస్ జగన్‌పై షర్మిల ప్రశ్నల వర్షం - Sharmila Counter to YS Jagan