AP SSC Result 2024 Released : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్ష ఫలితాలలో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 5 లక్షల 34 వేల 574 మంది ఉత్తీర్ణులయ్యారు. నేడు వెలువడిన పదో తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 84.32 శాతం మంది పాసయ్యారు.
AP Tenth Class Results: 2 వేల 803 పాఠశాలల్లో వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా, 17 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత నమోదైంది. 96.37 శాతంతో మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా, 62.47 శాతంతో కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఏపీ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 98.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదే విధంగా ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 96.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఏపీ మోడల్ స్కూళ్లలో 92.88 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 94.56 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. అదే విధంగా ఆశ్రమ పాఠశాలల్లో 90.13 శాతం, కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో 88.96 శాతం, కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో 88.96 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 89.64 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 79.38 శాతం, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో 80.01 శాతం, మున్సిపల్ హైస్కూళ్లలో 75.42 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 74.40 శాతం విద్యార్థులు పాసయ్యారు. వీరిలో 69.26 శాతం మంది ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించగా, 11.87 శాతం మంది సెకండ్ క్లాస్లో, 5.56 శాతం మంది థర్డ్ క్లాస్లో పాసయ్యారు.
త్వరలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల - Telangana Inter Results Release
మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే సప్లిమెంటరీ, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని అన్నారు. మెమోలు 4 రోజుల్లో వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి: రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 473 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30 వరకు పదవ తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 6 లక్షల 54 వేల మంది పరీక్ష రుసుము చెల్లించారు. వీరిలో 6 లక్షల 23 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. లక్షా రెండు వేల మంది ప్రైవేటుగా పరీక్ష రాశారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net, https://results.bse.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా (Websites For SSC Result) తెలుసుకోవచ్చు.
పోటీ పరీక్షలు రాస్తున్నారా? ఈ 5 టిప్స్ పాటిస్తే విజయం పక్కా! - Competitive Exam Success Tips