AP Political Leaders Congratulate Manu Bakar: పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మను బాకర్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. చరిత్ర సృష్టించి పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా అవతరించినందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఆమె కాంస్య గెలిచి పారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశానికి మొదటి పతకాన్ని అందించారని సీఎం చంద్రబాబు అన్నారు.
Deputy CM Pawan Kalyan: పారీస్ ఒలంపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన యువ షూటర్ మను బాకర్‌కి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో కాంస్యం సాధించారని కొనియాడారు. షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ కావటం సంతోషదాయకం అని అన్నారు. ఒలంపిక్స్‌లో మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేందుకు ఇది నాంది అని పవన్ కల్యాణ్ తెలిపారు.
Minister Nara Lokesh: ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన మను బాకర్‌కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలియజేశారు. పది మీటర్ల ఎయిల్ పిస్టల్ విభాగంలో మనుబాకర్ కాంస్యం సాధించారని కొనియాడారు. షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించాని అన్నారు. మనుబాకర్ స్ఫూర్తితో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
రోడ్లపై తిష్ట వేస్తోన్న కుక్కలు, ఆవులు - వాహనదారులకు చుక్కలు - Dogs and Cows are Roaming on Roads
Mandipalli Ramprasad Reddy: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించి చరిత్ర సృష్టించిన మను బాకర్‌కు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించి అసాధారణ నైపుణ్యం, అంకితభావం ప్రదర్శించారని రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ విజయం మన అథ్లెట్లు స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని పతకాలు సాధించేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. మీరు విజయాలను కొనసాగిస్తూ, మరిన్ని పతకాల సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ పతకం మను బాకర్ వ్యక్తిగత నైపుణ్యానికి గుర్తింపు మాత్రమే కాదని, మీ ప్రయాణమంతా మీకు అండగా నిలిచిన మీ కోచ్‌లు, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యుల సమిష్టి కృషికి ప్రతిబింబమని మంత్రి అభిప్రాయపడ్డారు.
MLA YS Jagan: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించి చరిత్ర సృష్టించిన మను బాకర్‌కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. పది మీటర్ల ఎయిల్ పిస్టల్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారని జగన్ తెలిపారు. యావత్ భారతదేశాన్ని గర్వించేలా చేశారని సామాజిక మాద్యమం 'ఎక్స్' తెలిపారు.