ETV Bharat / state

లెస్బియన్ రిలేషన్ షిప్​ - హైకోర్టులో హెబియస్​ కార్పస్​ పిటిషన్​ - AP HC ON LESBIAN PARTNER PETITION

లెస్బియన్‌ భాగస్వామిని నిర్బంధించారంటూ హైకోర్టులో పిటిషన్​ - ఆ యువతి మేజర్‌ అని ఇష్టప్రకారం నడుచుకునే వెసులుబాటు ఉంటుందన్న ధర్మాసనం

AP HC on Lesbian Partner Petition
AP HC on Lesbian Partner Petition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

AP HC on Lesbian Partner Petition : తన లెస్బియన్‌ భాగస్వామిని ఆమె తండ్రి అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడకు చెందిన ఓ యువతి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై మంగళ నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. అక్రమ నిర్బంధానికి గురైందని ఆరోపణ ఎదుర్కొంటున్న మరో అమ్మాయితో న్యాయమూర్తులు ఛాంబర్​లో మాట్లాడారు. ఆమె మేజర్‌ అయినందున ఇష్టప్రకారం ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. నిర్ణయాలు తీసుకునే హక్కు సదరు యువతికి ఉంటుందని తెలిపింది. చట్ట నిబంధనలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని గుర్తుచేసింది. ఈ విషయంలో అమ్మాయి తండ్రి జోక్యం చేసుకోకుండా నిలువరించాలని పోలీసులకు ధర్మాసనం స్పష్టంచేసింది.

ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. లెస్బియన్‌ భాగస్వాములైన తాము ఏడాదికిపైగా సహజీవనం చేస్తున్నామని, కృష్ణలంకలో ఉంటున్న తన స్వేహితురాలి తండ్రి ఆమెను అక్రమంగా నిర్బంధించారంటూ ఓ యువతి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. లెస్బియన్‌ సంబంధం చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు. మేజర్‌ అయిన యువతిని ఆమె తండ్రి నిర్బంధించండం చట్ట విరుద్ధమని న్యాయస్థానానికి తెలిపారు.

వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ఆ యువతి తండ్రికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. చిరునామాలో ఎవరు లేరన్న కారణంతో అవి వెనక్కి వచ్చాయి. దీంతో ఆ అమ్మాయిని తమ ముందు హాజరుపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మంగళవారం నాడు పోలీసులు ఆమెను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఆ యువతితో న్యాయమూర్తులు ఛాంబర్​లో మాట్లాడారు. ఆమె మేజర్‌ కాబట్టి ఆమె ఇష్టానికి అనుగుణంగా నడుచుకునే వెసులుబాటు ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది. వ్యాజ్యంపై విచారణను మూసివేసింది.

'చలానాలు వేసి చేతులు దులిపేసుకుంటే కుదరదు - మూడు నెలల్లో 667 మరణాలా?'

స్త్రీలకే కాదు, పురుషులకు కూడా గౌరవ మర్యాదలుంటాయి: కేరళ హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.