AP Govt Released New Tourism Policy: ఏపీ టూరిజం పాలసీ (AP Tourism) 2024 - 2029ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లకు పర్యాటక పాలసీ అమల్లో ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్ధిక వృద్ధి, ఉపాధి కల్పన తదితర అంశాల లక్ష్యంగా నూతన విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కొత్త విధానం ఉండనుంది.
ఎకో టూరిజం, క్రూయిజ్ టూరిజం, బీచ్ సర్క్యూట్లు, బ్యాక్ వాటర్ టూరిజంను ప్రోత్సహించేలా కొత్త విధానమని పేర్కొంది. ఈ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేలా కొత్త విధానం దృష్టి పెడుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయటంతో పాటు విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేలా కొత్త పాలసీ ప్రభుత్వం రూపొందించింది. పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించేలా కొత్త పాలసీ రూపొందిందని ప్రభుత్వం తెలిపింది.
పిస్టల్ షూటింగ్‌లో దూసుకెళ్తున్న విశాఖ యువ క్రీడాకారిణి - ఒలింపిక్స్ పతకంపై గురి!