ETV Bharat / state

వైఎస్సార్సీపీ ఇసుక దోపిడీపై విజిలెన్స్‌ విచారణ - రేవుల్లో అక్రమాలపై ఆరా - Vigilance Inquiry on Illegal Sand - VIGILANCE INQUIRY ON ILLEGAL SAND

Vigilance Inquiry on Illegal Sand : వైఎస్సార్సీపీ పాలనలో సాగిన ఇసుక దోపిడీపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. గుత్తేదారు సంస్థ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినా నాడు గనులశాఖ పట్టించుకోలేదు. గనులశాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి చేసిన మోసాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు రేవుల్ని పంచుకుని దోపిడీకి పాల్పడిన తీరుపై విజిలెన్స్‌ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పరిధిలోని రేవుల్లో జరిగిన తవ్వకాల పరిశీలనతో పాటు బాధితులు, గతంలో ఫిర్యాదు చేసినవారిని విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు.

Vigilance Inquiry on Illegal Sand
Vigilance Inquiry on Illegal Sand (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 7:01 AM IST

YSRCP Government Illegal Sand Mining : పాపఘ్ని, పెన్నా, కుందూ, చెయ్యేరుతో పాటు ఉపనదుల్లోనూ ఐదేళ్లూ ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. సుప్రీంకోర్టు, ఎన్జీటీ హెచ్చరికలను పట్టించుకోకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. కాంట్రాక్టు సంస్థ జయప్రకాశ్ పవర్‌ వెంచర్స్‌ 2021 మే నుంచి 2023 నవంబర్ వరకు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ప్రధాన గుత్తేదారుగా ఉంది.

Vigilance Investigation YSRCP Sand Irregularities : ఉపగుత్తేదారుగా టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవహరించగా ప్రభుత్వానికి చెల్లింపులన్నీ జేపీ సంస్థ ద్వారానే జరిగాయి. ఇసుక దందా సాగించిన ముఠాల వెనుక అసలు ఉన్నది ఎవరు? అడ్డొచ్చిన వారిని, ప్రశ్నించినవారిని చంపడానికీ వెనకాడని బరితెగింపు ఎలా వచ్చింది? ఇసుక దోపిడీ ముఠాల్ని అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఎందుకు ఊరుకుంది? వంటి ప్రశ్నలతో విజిలెన్స్‌ విచారణ కొనసాగింది.

వివరాలు రాబట్టిన విజిలెన్స్ : వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్ల ఇసుక గుత్తేదారు నారాయణరెడ్డి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంపై విజిలెన్స్‌ ఆరా తీస్తోంది. కమలాపురం నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నాయకుడు వైఎస్సార్సీపీలో ఉండగా ఇసుక దందాపై సొంత పార్టీ నేతలపైనే తిరుగుబాటు చేశారు. అనంతరం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇసుక దందాపై పోరాడుతూ మరింత మద్దతు కోసం టీడీపీలో చేరారు. ఈ నేతను సైతం విజిలెన్స్‌ కలిసి వివరాలు రాబట్టింది.

Illegal Sand Mining in AP : సిద్దవటానికి చెందిన అధికారపార్టీ నేతలు రేవుల్ని పంచుకుని నెలవారీ మామూళ్లను గత సర్కార్ పెద్దలకు అందజేసిన వివరాలను విజిలెన్స్ సేకరించింది. మామూళ్లు అధిక మొత్తంలో చెల్లించాల్సి రావడం, దీనకి తోడూ ఇసుక అమ్మకాల్లో లాభాలు రాకపోవడంతో వీధిన పడిన బాధితులను కలిసే ప్రయత్నాల్లో ఉంది. వారి ద్వారా నాటి ప్రభుత్వ పెద్దలపై అభియోగాలు నమోదుచేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

చేతిరాత బిల్లులు, డిజిటల్‌ చెల్లింపులు లేకుండా నగదు రూపంలో వసూళ్లు తదితర అంశాలపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. అన్నమయ్య జిల్లా పరిధిలో ఇద్దరు కీలక వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక దందా సాగింది. ఇవన్నీ చూస్తూ వత్తాసు పలికారంటూ ఉద్యోగ విరమణ చేసిన గనులశాఖ డీడీపైనా క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక దందాపై ఫిర్యాదులు చేసినా అప్పటి కలెక్టర్లు, డీడీ పట్టించుకోలేదని ఫిర్యాదుదారులు చెప్పినట్లు తెలిసింది.

మూడేళ్లలో 3 వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ - వైఎస్సార్సీపీ ముఠా మాస్టర్ ప్లాన్ - Sand Mining in Andhra Pradesh

నదులపై వైఎస్సార్సీపీ ఇసుక తోడేళ్లు - అభివృద్ధి పనులకు కొరత - YSRCP Leaders Illegal Sand Mining

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.