ETV Bharat / state

ఫైబర్‌నెట్ అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ - మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్​ - EX MD Madhusudan Reddy Suspend

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 12:59 PM IST

Updated : Aug 19, 2024, 1:10 PM IST

Fibernet former MD Madhusudan Reddy Suspended: ఏపీ పైబర్ నెట్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ఆ సంస్థ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూర్చేలా మధుసూదన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారని ప్రభుత్వం జీవోలో పేర్కోంది. ప్రస్తుతం ఈ అక్రమాలపై విచారణ జరుగుతున్న దృష్ట్యా మధుసూదన్ రెడ్డి డెప్యుటేషన్ పొడిగించాలని కోరుతూ రైల్వే బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట్ రెడ్డిని కూడా రాష్ట్రప్రభుత్వానికే అప్పగిస్తూ ఆయన మాతృ సంస్థ కోస్టు గార్డు ఏపీ సీఎస్​కు లేఖ రాసింది.

Madhusudan Reddy Suspend
Madhusudan Reddy Suspend (ETV Bharat)

Fibernet former MD Madhusudan Reddy Suspended: ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్​ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో భారీఎత్తున నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని, పలువురు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చారని తెలిపింది. అప్పట్లో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుత, మాజీ ఉద్యోగులను ఆయన ప్రభావితం చేస్తున్నట్లు వివరించింది.

Madhusudhan Reddy Scams: మధుసూధన్​రెడ్డి ఏపీఎస్​ఎఫ్ఎల్​ రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని, సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని జీవోలో వెల్లడించింది. అలాగే కేంద్ర సర్వీసు నిబంధనలను ఆయన ఉల్లంఘించినట్టు స్పష్టం చేసింది. ఎండీగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగులుగా నియమించుకున్నారని తెలిపింది. ఆయన విచారణను ప్రభావితం చేయకుండా, సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అడ్డుకునేందుకే సస్పెండ్‌ చేసినట్లు పేర్కొంది. మధసూదన్‌రెడ్డి అమరావతిని విడిచి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఫైబర్‌నెట్​లో వందల కోట్ల రూపాయల అక్రమాలు- సీఎస్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు - TDP Complaint to CS on Fibernet

మధుసూదన్ రెడ్డి డెప్యుటేషన్​పై రైల్వే బోర్డుకు లేఖ: మరోవైపు ఏపీఎఫ్ఎస్ఎల్ అక్రమాలపై విచారణలో భాగంగా మధుసూదన్ రెడ్డి డెప్యుటేషన్ పొడిగింపుపై ప్రభుత్వం రైల్వే బోర్డుకు లేఖ రాసింది. మధుసూదన్ రెడ్డి డెప్యుటేషన్​ను మరో 6నెలల పాటు పొడిగించాలని కోరుతూ రైల్వే బోర్డు ఛైర్మన్​కు సీఎస్ లేఖ రాశారు. మరో 2 రోజుల్లో మధుసూదన్ రెడ్డి డెప్యుటేషన్ ముగుస్తున్న సమయంలో ప్రభుత్వం ఈ లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది. రైల్వే అకౌంట్స్ సర్వీసు నుంచి 2019 ఆగస్టు 26న డెప్యుటేషన్​పై మధుసూధన్ రెడ్డి ఏపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్​కు ఎండీగా నియమించింది. ప్రస్తుతం 2024 ఆగస్టు 22వ తేదీతో మధుసూదన్ రెడ్డి డెప్యుటేషన్ గడువు ముగుస్తోంది. కేసు విచారణ దృష్ట్యా మధుసూదన్ రెడ్డి డెప్యుటేషన్​ను పొడిగించాలని కోరుతూ రైల్వే బోర్డుకు లేఖ రాసింది.

వెంకట్ రెడ్డి కూడా పొడిగింపు: మరోవైపు గనులు, ఇసుక అక్రమ తవ్వకాలు, అవినీతి వ్యవహారాల్లో సస్పెన్షన్​లో ఉన్న ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డి డెప్యుటేషన్​ను కూడా పొడిగిస్తూ కోస్టుగార్డు ప్రధాన కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. రాష్ట్ర గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి డెప్యుటేషన్ పొడిగిస్తున్నట్టు కోస్టు గార్డు ప్రధాన కార్యాలయం సీఎస్​కు లేఖ రాసింది. ప్రస్తుతం వెంకట్ రెడ్డి 2024 ఆగస్టు 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా అప్పటి వరకూ డెప్యుటేషన్ పొడిగించినట్టు పేర్కోంటూ సీఎస్​కు సమాచారం ఇచ్చింది. అలాగే వెంకట్ రెడ్డి అవినీతి వ్యవహారాలు, సర్వీసు నిబంధనల ఉల్లంఘనలపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు కూడా తెలియచేసినట్టు వెల్లడించింది. వెంకటరెడ్డిపై తదుపరి రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని స్పష్టం చేస్తూ లేఖలో స్పష్టం చేసింది.

ఏపీ ఫైబర్‌నెట్‌లో భారీ కుంభకోణం - రూ.151 కోట్లు గోల్​మాల్​ - AP FiberNet Scam Updates

అన్న కాంట్రాక్టర్​, మేనల్లుడు హెచ్​ఆర్ - ఫైబర్​నెట్ మాజీ ఎండీ మధసూధన్​రెడ్డి అక్రమాలు - EX MD Frauds on FiberNet

Last Updated : Aug 19, 2024, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.