ETV Bharat / state

గుడ్​న్యూస్ - ఇక చేరువలోనే రేషన్ షాప్ - కొత్తగా 4 వేల దుకాణాలు - New Ration Shops in AP

AP Govt Focus on Ration Shops : రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కొత్తగా 4 వేల చౌకదుకాణాలు ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా ఖాళీగా ఉన్న 6,500ల షాప్​లకు డీలర్లను నియమించనుంది. మరోవైపు ఇక ఎండీయూలతో ఉపయోగం లేదని సర్కార్ భావిస్తుంది.

New Ration Shops in AP
New Ration Shops in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 9:07 AM IST

New Ration Shops in AP : ఏపీలో రేషన్‌ పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా చౌకదుకాణాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 29,796 దుకాణాలకు అదనంగా మరో 4 వేలు ఏర్పాటు చేయనున్నారు. వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో అమల్లోకి తెచ్చిన మొబైల్‌ డెలివరీ యూనిట్ల (ఎండీయూ)లతో కార్డుదారులకు ఉపయోగం లేకపోగా పనులు మానుకుని ఎదురు చూడాల్సి వస్తోంది.

4000 New Ration Shops Will Established in AP : ఈ క్రమంలో రేషన్ దుకాణల వ్యవస్థను పటిష్ఠపరిచి, వారి ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేయించాలని సర్కార్ యోచిస్తోంది. కార్డుదారులకు వీలైనంత దగ్గరలోనే దుకాణాలు ఉండేలా చూడటం, నిర్దేశిత సమయంలో సరైన తూకంతో రేషన్‌ అందించడమే లక్ష్యంగా కొత్త దుకాణాలను అందుబాటులోకి తీసుకురానుంది. వైఎస్సార్సీపీ హయాంలో ఇంటింటికీ రేషన్‌ పేరుతో 9,260 ఎండీయూలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాహనాల కొనుగోలు, నిర్వహణ పేరుతో రూ. 1,800 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అయినా గడప వద్దకు రేషన్‌ అందడం లేదు. రేషన్‌ బండి ఎప్పుడొస్తుందో తెలియక కూలి పని మానుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి. చాలాచోట్ల రేషన్‌ డీలర్ల ద్వారానే నిత్యావసరాలు అందించాల్సి వస్తోంది. మరోవైపు ఎండీయూ వ్యవస్థ లేని రోజుల్లోనే రేషన్‌ పంపిణీ బాగుందని కార్డుదారుల్లోనూ అభిప్రాయం ఉంది.

ఇంఛార్జ్​ల ఆధ్వర్యంలో 6,500 పైగా దుకాణాలు : కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నెలకు రెండుసార్లు చొప్పున బియ్యం, కందిపప్పు వంటివి రేషన్‌ దుకాణాల ద్వారానే పంపిణీ చేశారు. ఇలాంటి కీలకమైన వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఏపీలో 29,796 చౌకధరల దుకాణాలు నడుస్తున్నాయి. అందులో 6,500కు పైగా ఖాళీలున్నాయి. ఒకే డీలర్‌కు రెండు, మూడు దుకాణాల ఇంఛార్జ్​ల బాధ్యతలు ఇచ్చారు. వీటన్నింటిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి సర్కార్ చర్యలు చేపట్టింది.

ఎక్కువ కార్డులున్న చోట మరో దుకాణం : ప్రస్తుతం అమల్లో ఉన్న ఎండీయూ వ్యవస్థతో ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే రేషన్ దుకాణాలను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టింది. ఖాళీగా ఉన్న చోట్ల డీలర్లను నియమించడంతోపాటు కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా చౌకదుకాణాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఏపీలో 1.48 కోట్ల రేషన్‌ కార్డులున్నాయి. సగటున ఒక్కో దుకాణం పరిధిలో 500 రేషన్‌ కార్డులు వస్తాయి. అయితే కొన్నిచోట్ల ఒక్కో దుకాణ పరిధిలో 1,000 నుంచి 1,200 వరకు కార్డులు ఉన్నాయి. ఇలా ఎక్కువ కార్డులున్న చోట అదనపు దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు.

సగటున పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 700, గ్రామీణ ప్రాంతాల్లో 750 కార్డులు మించకుండా చూస్తారు. ఈ లెక్కన అదనంగా 4,000ల రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. త్వరలోనే కొత్త దుకాణాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

కొత్త జంటలకు గుడ్ న్యూస్- కొత్త రేషన్‌ కార్డుల జారీకి కూటమి సర్కార్ చర్యలు - NEW RATION CARDS

పౌరసరఫరాల సంస్థను ఊడ్చేశారు - పేదల సరుకుల్లో వైఎస్సార్సీపీ నేతల చేతివాటం - Corruption in ration distribution

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.