AP Government Allotted Departments to CMO Officers : ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు శాఖల విభజన చేశారు. సీఎంఓలోని నలుగురు అధికారులు పర్యవేక్షించాల్సిన అంశాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు జీఎడీ, హోం, ఆర్ధిక, రెవెన్యూ, ఎక్సైజ్, వైద్య ఆరోగ్యం, దిల్లీ, విదేశీ వ్యవహారాలు, సీఎం పేషీ సమన్వయం బాధ్యతలు అప్పగించారు.
సీఎం కార్యదర్శి ఏవీ రాజమౌళికి జలవనరులు, గనులు, విద్యుత్, వ్యవసాయం, సాంఘిక, బీసీ సంక్షేమం, సీఎంఆర్ఎఫ్, సీఎం వినతుల పర్యవేక్షణ చూడనున్నారు. సీఎం మరో కార్యదర్శి ప్రద్యుమ్నకు విద్య, మున్సిపల్, పంచాయతీ రాజ్, అటవీ, రవాణా, ఆర్ అండ్ బీ, పౌర సరఫరాలు, గృహనిర్మాణం, మహిళ, శిశు, గిరిజన సంక్షేమం, యువజన, క్రీడలు, సెర్ఫ్ శాఖలు అప్పగించారు.
ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రాకు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, సమాచార పౌరసంబంధాలు, కార్మిక, ముఖ్యమంత్రి దిల్లీ, విదేశీ పర్యటనల సమన్వయం, ప్రవాసాంధ్రుల వ్యవహారాలు కేటాయించారు.