ETV Bharat / state

రాజధానిలో అభివృద్ధికి భారీగా నిధులు - వాటి నిర్మాణానికి వందల కోట్లు - CRDA AUTHORITY MEETING DECISIONS

సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ap_crda_38th_authority_meeting_decisions
ap_crda_38th_authority_meeting_decisions (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2024, 10:16 AM IST

AP CRDA 38th Authority Meeting Decisions : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ(CRDA) అథారిటీ 38వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఎఎస్​ల కోసం నిర్మించిన అపార్టుమెంట్ల వద్ద మిగిలిపోయిన పనుల కోసం రూ.524 కోట్లకు పాలనానుమతి ఇచ్చారు. 18 టవర్లు, 432 అపార్టుమెంట్ల నిర్మాణం కోసం పనులు చేపట్టేందుకు పాలనానుమతి ఇచ్చారు. అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం జీప్లస్ 7గా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ. 160 కోట్లతో అనుమతి ఇచ్చారు. సీఆర్డీఏ, ఏడీసీ, పురపాలక శాఖలోని అన్నిహెచ్ఓడీ కార్యాలయాలు ఈ భవనంలోనే వచ్చేలా నిర్మాణం చేపట్టనున్నారు.

వెయ్యి కోట్లతో అమరావతి రైల్వే లైన్ - పనులు వేగవంతం - New Amaravati Railway Line

ఆ నెలలోపు టెండర్ల ప్రక్రియ పూర్తి : రాజధాని పరిధిలో ఏడీసీ(ADC) నిర్మించిన 360 కిలోమీటర్ల రహదారులు, డక్టుల నిర్మాణానికి సంబంధించి రీటెండరింగ్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. కొండవీటి వాగు, పాలవాగు నుంచి వచ్చే వరద నీటిని గ్రావిటీ కెనాల్‌లో వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. నెదర్లాండ్స్ నుంచి గ్రావిటీ కెనాల్‌కు సంబంధించిన డిజైన్లు కూడా తీసుకున్నామన్నారు. అదనపు వరద నీటి కోసం ఆరు చోట్ల రిజర్వాయర్లను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. డిసెంబరులోపు అన్ని పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

పది రోజుల్లోగా ప్లాట్ల కేటాయింపు : అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాలకు సంబధించిన పనులకు 2025 జనవరిలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. గతంలో 9.2 ద్వారా భూములిచ్చిన రైతులకు పది రోజుల్లోగా ప్లాట్ల కేటాయింపు చేయనున్నారు. రాజధాని పరిధిలో జంగిల్ క్లియరెన్సు దాదాపు పూర్తి అయ్యిందని తెలిపారు. కృష్ణా నది వరద గరిష్టంగా 11.43 లక్షల క్యూసెక్కుల వచ్చిన నేపథ్యంలో కరకట్ట రహదారిని రీడిజైన్ చేయాలని నిర్ణయించారు. రాజధానిలోని ఈ-11,ఈ 13 మార్గాల్ని త్వరలోనే జాతీయ రహదారికి కలిపే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రిజర్వు ఫారెస్టు ఉన్న ప్రాంతంలో కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు మొదలు పెడతామన్నారు.

రాజధాని రైతులకు మంచి రోజులొచ్చాయి - సాఫీగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు - Returnable Plots Registration

అమరావతిలో మరో రెండు రాచబాటలు - సీఆర్​డీఏ తాజా ప్రతిపాదన - Amaravathi National Highways

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.