Chandrababu Revanth Reddy Meeting Today: ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలపై ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు వచ్చే అజెండా ఖరారు అయ్యింది. మొత్తం పది అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చేలా అజెండాను సిద్దం చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఏపీ నుంచి ఈ సమావేెశానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్‌లు హాజరు కానున్నారు. వీరితో పాటు అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు కూడా హాజరు కానున్నారు.
ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10 సంస్థల అస్తుల పంపకాలపై ఇరువురు సీఎంల మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. షీలా బీడే కమిటీ సిఫార్సులను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్లు, ఏపీఎఫ్సీ అంశాల పై చర్చ జరుగనుంది. ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై ప్రధానంగా చర్చకు రానుంది.
అలాగే ఉద్యోగుల పరస్పర మార్పిడి పైనా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. అలాగే వృత్తి పన్ను పంపకం పై కూడా ఇరువురు నేతలు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చ జరుగనుంది. హైదరాబాద్‌లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించే అంశం కూడా ఏపి ప్రతిపాదించనుంది.
మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు నిల్వల ఉండిపోయాయి. విభజన పూర్తి కానీ ఈ సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ 8 వేల కోట్లు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. గత 10 ఏళ్లుగా బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు ఎవరూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఏపీ తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా ఈ సంస్థల విభజన పూర్తి కాకపోవడంతో ఈ సంస్థలకు చెందిన 8 వేల కోట్ల రూపాయలను రెండు రాష్ట్రాలు అలాగే ఉంచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దిల్లీలో మారిన లెక్క - రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులపైనే వరుస భేటీలు - CBN Delhi Tour
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడటంతో వీటిని వినియోగించుకోవడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 9వ షెడ్యూల్‌లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఒక్క ఏపి జెన్కో విలువే రూ.2,448 కోట్లుగా నిర్ధారణ అయ్యింది. అత్యల్పంగా ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్‌ఫెడ్‌ను విలువ కట్టారు. 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల్లో రూ.2,994 కోట్ల నిధులు ఉన్నట్టు గుర్తించారు.
వీటికి సంబంధించి ఇప్పటికే రూ.1,559 కోట్లను ఏపీ - తెలంగాణ రాష్ట్రాలు పంచుకున్నాయి. అయితే రూ.1,435 కోట్ల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పంచాయితీ తేలటం లేదు. చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైనా సీఎంల మధ్య చర్చ జరగనుంది.
"దటీజ్ చంద్రబాబు" హాట్‌టాపిక్‌గా దిల్లీ తొలి పర్యటన- నాడు జగన్ 29సార్లు - CBN Delhi Tour