ETV Bharat / state

భూ కబ్జా చేశారో అంతే సంగతులు - కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం - AP CABINET KEY DECISIONS

14 ఏళ్ల జైలు శిక్ష, భూమి విలువతోపాటు, నష్టపరిహారం కలిపి జరిమానా - ఆక్రమణల నియంత్రణకు కొత్త చట్టం

AP Cabinet Key Decisions
AP Cabinet Key Decisions (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 7:20 AM IST

AP Cabinet Key Decisions : రాష్ట్రంలో ఇష్టానుసారం ప్రభుత్వ, పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడినవారికి తగిన గుణపాఠం చెప్పేలా, అలాంటి కఠిన శిక్షలు విధించి, భారీ జరిమానాలతో చెక్‌ పెట్టేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై భూ ఆక్రమణలకు పాల్పడేవారికి గరిష్ఠంగా 14 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అలాగే ఏపీ డ్రోన్‌ పాలసీ, డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదేవిధంగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) పరిధి పెంపునకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

రాష్ట్రంలోని అన్ని భూములకు రక్షణ : ప్రభుత్వ, ప్రైవేటు భూములు అక్రమించుకోవడం, ఎక్కడో దూరంగా ఉంటున్నవారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీపత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి నియంత్రించేందుకు ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం-1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం-2024 అమలుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితమైంది. దాని ద్వారా రూ.5 వేల వరకు జరిమానా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని భూముల రక్షణకు వీలుంటుంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష, భూమి విలువతోపాటు, నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి, నిర్ణీత కాలంలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.

మూడు కీలక పాలసీలకు ఆమోదం :

  • మంత్రివర్గ సమావేశంలో ఏపీ డ్రోన్‌ పాలసీకి ఆమోదం తెలిపారు. కర్నూలును డ్రోన్‌ తయారీ హబ్‌గా చేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో డ్రోన్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ, తయారీ కేంద్రాన్ని కర్నూలులో స్థాపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. రూ.3 వేల కోట్ల వరకు రాబడి, 15 వేల మందికి ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడి. డ్రోన్‌ పైలట్‌ శిక్షణ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ల ఏర్పాటుకు యోచన.
  • అలాగే ఏపీ డేటా సెంటర్‌ పాలసీ 4.0కి ఆమోదం తెలిపారు. 2024-29లో 200 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటే దీని లక్ష్యం. కొత్త డేటా సెంటర్ల ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ పాలసీ.
  • సమావేశంలో ఏపీ సెమీకండక్టర్‌ అండ్‌ డిస్‌ప్లే ఫాబ్‌ పాలసీ 4.0కి ఆమోదం తెలిపారు. ఈ పాలసీ ద్వారా చిప్, సెమీకండక్టర్ల రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వీలుంటుంది. దేశంలో ఈ పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం మేర రాయితీలు కూడ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 30 శాతం రాయితీ ఇచ్చేలా నిర్ణయం. ప్రస్తుతం ఈ పరిశ్రమలున్న గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలతో పోటీ పడాలని నిర్ణయం. 2014-19లో ఎలక్ట్రానిక్, మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు ముందుకొస్తే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా స్పందించి, రాష్ట్రంలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఇప్పుడు సెల్‌ఫోన్ల తయారీలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.

వారి ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ :

2014-19లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఇకపైనా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని ఆయా కళాశాలల యాజమాన్య ఖాతాల్లో జమ చేసే మంత్రివర్గం నిర్ణయానికి తీసుకుంది. గత ప్రభుత్వంలో తల్లుల ఖాతాలో వీటిని జమ చేయగా, వారు సకాలంలో కళాశాలలకు ఫీజులకు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

ఆ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :

  • చిత్తూరు జిల్లా కుప్పం కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ పునరుద్ధరణకు, దాని పరిధిలోని నాలుగు మండలాలు, ఓ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి జులై 8న జారీ చేసిన ఉత్తర్వులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • అలాగే పిఠాపురం ప్రధాన కేంద్రంగా పిఠాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా) ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
  • పిఠాపురం ప్రాంతంలో 5-6 లక్షల మందికి మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో అక్కడున్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా రూ.38.38 కోట్లతో ఉన్నతీకరించేందుకు ఆమోదం లభించింది. అక్కడ 66 కొత్త పోస్టుల మంజూరుకు నిర్ణయం తీసుకుంది.
  • రాష్ట్రంలో 311 పారిశ్రామిక భూ కేటాయింపులపై ఏపీఐఐసీ(APIIC) రాష్ట్రస్థాయి భూకేటాయింపు కమిటీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పరిశ్రమలకు ఏపీఐఐసీ ద్వారా 50 ఎకరాల వరకు భూమి కేటాయించే విధానం పునరుద్ధరణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

సీఆర్‌డీఏ పరిధి పెంపు :

  • ఏపీ సీఆర్‌డీఏ పరిధిని 8,352.69 చ.కి.మీ. పునరుద్ధరించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 1,069.55 చ.కి.మీ. మేర సత్తెనపల్లి మున్సిపాలిటీ, పల్నాడు జిల్లాలోని పుడా పరిధిలోని ఆరు మండలాల్లో 92 గ్రామాలు, బాపట్ల జిల్లాలోని బుడా పరిధిలోని 5 మండలాల్లో 62 గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకొచ్చేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
  • 189 కి.మీ. మేర అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు, విజయవాడ తూర్పు బైపాస్‌ మంజూరు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
  • గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో అనేక పనులు చేపడితే వాటిని చేసిన చిన్నచిన్న గుత్తేదారులకు రూ. 331 కోట్ల బిల్లులు చెల్లించకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ పేరిట నిలిపేసి, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పెట్టింది. అలాంటి వారికి రూ. 331 కోట్లు చెల్లించాలని మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ చట్ట ప్రకారం వారికి 12 శాతం వడ్డీ చెల్లించడంపైనా మంత్రివర్గం పరిశీలించింది.

డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం - 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం

అక్రమార్కులకు వంతపాడే ఆ చట్టం, మరో జీవో రద్దు - రేపటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.