ETV Bharat / state

డోలీ మోతలు కనిపించకూడదు - గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖలపై సీఎం సమీక్ష - CM Review on Welfare Issues

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 5:17 PM IST

CM Chandrababu Review on Welfare Issues: గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, హాస్టళ్ల మెరుగుదలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో చర్చించారు. గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు నివారణ చర్యలపైనా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని సీఎం ఆదేశించారు.

CM Chandrababu Review on Tribal Welfare
CM Chandrababu Review on Tribal Welfare (ETV Bharat)

CM Chandrababu Review on Welfare Issues: గిరిజన ప్రాంతాల్లో ఇక నుంచి డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచనలు చేశారు. గిరిజన, సాంఘిక, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, కొండలపై ఉండే గిరిజనులకున్న సౌకర్యాలపై చర్చించారు. గిరిజన హాస్టళ్లల్లోని పరిస్థితులపై ఏపీ ఆరా తీశారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

అరకు కాఫీ బ్రాండ్ ప్రమోషన్, అరకు కాఫీ షాప్స్ ఏర్పాటుపై సీఎం చర్చించారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్​పై సీఎం వివరాలు అడిగి తెలుసు కున్నారు. గతంలో అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, కానీ తరువాత వచ్చిన ప్రభుత్వం అరకు కాఫీతో పాటు, గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టలేదని అన్నారు. ఈ విషయంలో సమగ్రమైన మార్పులు రావాలని, గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చని సీఎం అన్నారు.

గిరిజన ప్రాంతాల్లో ఎంతో సారవంతమైన భూములు ఉన్నాయని ఆ ప్రాంతాల్లో పకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రొత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని అన్నారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్రం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదాయం, అలాగే గిరిజన ఉత్పత్తుల, ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు.

పేదరిక నిర్మూలనకు చంద్రబాబు కొత్త ఫార్ములా- నీతి అయోగ్​ సమావేశంలో ప్రతిపాదన - CHANDRABABU POLICY

గిరిజన మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందజేతపై సమీక్షించిన చంద్రబాబు, అంగన్వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సదుపాయాల కల్పనపై సమీక్షలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సీ సంక్షేమంపై, ఎస్సీ వర్గాలకు అందచేయాల్సిన అంశంపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. గిరిజన ప్రజలకు విద్యా పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సమీక్షించారు.

2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అధికారులు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకాలను నిర్వీర్యం చేశారని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే గిరిజనులకు సత్వర వైద్యం కోసం తెచ్చిన పథకాలను, కార్యక్రమాలను రద్దు చేసిన విధానంపై సీఎం సమీక్షించారు.

గుడ్​న్యూస్ చెప్పిన ప్రభుత్వం - వారందరికీ గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం - CM Chandrababu Review on Housing

CM Chandrababu Review On Tribal Welfare: గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు, ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలని సూచించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని మండిపడ్డారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా, ఫీడర్ అంబులెన్స్​లను తిరిగి ప్రవేశ పెట్టాలని ఆదేశించారు. 2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి, బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Announces 10 Lakh Donation: సీఎం చంద్రబాబును సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పి. భారతి కలిశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన న్యాయవిద్యార్ధి కె. సాయి ఫణీంద్ర చికిత్సకు సాయం అందించాలని ఆమె కోరారు. తక్షణం స్పందించిన సీఎం చంద్రబాబు, 10 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. మానవత్వం చూపిన చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

రాజముద్రతో భూమి పట్టాదారు పాసు పుస్తకాలు- స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు - CM Review On Revenue Department

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.