ETV Bharat / state

'రాంబాబూ నువ్వు మాకొద్దు' - అంబటికి సత్తెనపల్లిలో ఘరో పరాజయం! - Ambati lost in Sattenapalli constituency - AMBATI LOST IN SATTENAPALLI CONSTITUENCY

Ambati Rambabu lost in Sattenapalli constituency : సంబరాల రాంబాబుకు సత్తెనపల్లి ప్రజలు గుణపాఠం చెప్పారు. రాంబాబూ నువ్వు మాకొద్దు బాబూ అని ఇంటికి పంపించేశారు. అన్ని వర్గాల వారిని అందినకాడికి దోచుకున్న అంబటిని జనం ఛీత్కరించారు. విపక్ష నేతలపై అడ్డగోలుగా నోరేసుకుని పడిపోయిన మంత్రి వర్యులు మాకు అనవసరమని తీర్మానించి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో 25,950 ఓట్ల తేడాతో ఓడిపోయేలా చేశారు.

Ambati Rambabu lost in Sattenapalli constituency
Ambati Rambabu lost in Sattenapalli constituency (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 8:33 PM IST

Ambati Rambabu lost in Sattenapalli constituency : సంబరాల మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి జనం గుణపాఠం చెప్పారు. మాజీమంత్రి, టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మినారాయణ చేతిలో పరాజయం తప్పలేదు. ప్రతిపనికి పర్సెంటేజిలు, అన్ని వర్గాల వారిని అందినకాడికి దోచుకోవడంతో జనం ఛీకొట్టారు. నోటికి పని చెప్పటం తప్ప చేతల్లో ఎలాంటి పనులు చేయని అంబటి అనవసరమని జనం తీర్మానించారు. అసత్యాల్ని, అర్థసత్యాల్ని అందంగా చెపితే, నాటకీయత జోడిస్తే జనం నమ్మేస్తారనే బ్రమల్ని సత్తెనపల్లి ఓటర్లు పటాపంచలు చేశారు.

గుంటూరు జిల్లాలో కూటమి క్లీన్‌స్వీప్‌ - భారీ మోజర్టీతో గెలిచిన అభ్యర్థులు

గడ్డం నెరిస్తే రాజకీయాల్లో పెద్దరికం రాదు. చేసే పనులతో వస్తుంది. సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబే దీనికి నిదర్శనం. గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్​గా పేరొందిన కన్నా లక్ష్మినారాయణ తన పనులతో పెద్దమనిషిగా నిలబడ్డారు. అంబటి మాత్రం అధికారం, పదవిని అడ్డుపెట్టుకుని తనకు అడ్డులేదని విర్రవీగారు. ఇతర పార్టీల వారిపై నోరేసుకుని పడిపోవటంలో ముందుండే అంబటికి తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే కన్నాకు ఉన్న తేడాను జనం గుర్తించారు. కొన్ని కులాలను రెచ్చగొట్టి కన్నాపైకి ఉసిగొలిపినా, జనసేనతో సఖ్యత దెబ్బతీయాలని చూసినా, టీడీపీ అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకుని కన్నాను ఓడించేందుకు పన్నాగాలు పన్నినా అన్నీ తుస్సుమన్నాయి.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా చాణక్యం ముందు, అంబటి కుప్పిగంతులు పనిచేయలేదు. ప్రజలతో సంబంధాల విషయంలో వారికి మంచి చేసే విషయంలో ఇద్దరికి ఉన్న తేడాని సత్తెనపల్లి ప్రజలు గుర్తించారు. సంక్రాంతి లాటరీ టికెట్ పేరుతో వృద్ధులు, వికలాంగుల పెన్షన్లలో కోత పెట్టిన రాంబాబుకు ఓటర్లు కీలెరిగి వాత పెట్టారు. ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో వాటా అడిగిన పాపం, ఇలా ఎన్నో పాపాలు పరాజయం రూపంలో పలకరించాయి.

కడపలో ఐదు స్థానాల్లో టీడీపీ ఆధిక్యం - గతంలో కంటే జగన్​ తగ్గిన 28 వేల ఓట్ల మెజారిటీ

ఎమ్మెల్యేగా చేసిన అక్రమాలు, మంత్రిగా చేసిన అవినీతి వ్యవహారాలు అన్నీ ప్రజల్లో వ్యతిరేకత పెంచాయి. ప్రతి పనికి పర్సంటేజీలు తీసుకుంటూ అవినీతికి పాల్పడిన అంబటికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. తనకు మంత్రి పదవి వచ్చింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శల కోసమే అన్నట్లుగా వ్యవహరించారు. టీడీపీ నాయకులపై అయితే మరింత వెటకారంగా రెచ్చిపోయారు. కానీ నీటిపారుదల శాఖ మంత్రిగా అందులో వ్యవహారాల గురించి మాత్రం కొద్దిగా కూడా ఆలోచించరు. తెలుసుకోవడానికి అసలే ప్రయత్నించరు. కనీసం కాఫర్ డ్యాం అంటే ఏమిటో తెలియదు. డయాఫ్రం వాల్ తో పనిలేదు. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేరు. మంత్రి పదవికి ఇవన్నీ అవసరం లేదన్నట్లు ఢాంబికాలకు పోయారు.

మంత్రిగా రాష్ట్ర ప్రజలకు చేసిందేం లేదు. కనీసం తనను గెలిపించిన సత్తెనపల్లి ప్రజలకు ఏమైనా చేశారా అంటే అదీ లేదు. సంక్రాంతి సంబరాల పేరుతో చిందులేయటం అది చూసి జనం ఆనందిస్తే చాలనుకున్నారే తప్ప నియోజకవర్గంలో అభివృద్ధిని పట్టించుకోలేదు. అందుకే రాంబాబూ వద్దురా బాబూ అంటూ జనం తిరస్కరించారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూటమి క్లీన్​ స్వీప్‌ - పిఠాపురం నుంచి పవన్​ గెలుపు - AP Election Result2024

'రాంబాబూ నువ్వు మాకొద్దు' - అంబటికి సత్తెనపల్లిలో ఘరో పరాజయం (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.