ETV Bharat / state

అమరావతి డ్రోన్​ షో అదుర్స్​ - ఐదు గిన్నిస్​ రికార్డులు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సర్టిఫికెట్లు అందజేత - లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ పేరిట మొదటి రికార్డు

Amaravati Drone Show
Amaravati Drone Show (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 8 minutes ago

Amaravati Drone Show: విజయవాడ కృష్ణ నది తీరంలో జరిగిన అతిపెద్ద డ్రోన్ షో వీక్షకులను అబ్బురపరిచింది. అమరావతి డ్రోన్ ప్రదర్శన అయిదు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఈ మేర ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు సర్టిఫికెట్లు అందజేశారు. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ పేరిట డ్రోన్‌ షో మొదటి రికార్డు సాధించగా, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టించటం పేరిట రెండో రికార్డు అందుకుంది. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్ పేరిట మూడో రికార్డు నెలకొల్పింది. డ్రోన్ల ద్వారా అతి పెద్ద జాతీయ జెండా ప్రదర్శనతో నాలుగో గిన్నీస్ రికార్డు సాధించింది. ఏరియల్ లోగోతో డ్రోన్ షో అయిదో రికార్డు అందుకుంది. 5 గిన్నిస్ రికార్డుల్లో పోటీపడిన అమరావతి డ్రోన్ ప్రదర్శన చరిత్ర సృష్టించింది.

కనువిందు చేసిన నాటి పోస్టల్ స్టాంప్ ఆకృతి: డ్రోన్ షోలో ఒకే సారి 5500 డ్రోన్ల లైటింగ్​తో ఆకాశంలో వివిధ ఆకృతులను ప్రదర్శించారు. ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశగా భారీ ప్రదర్శన సాగింది. 1911 నాటి పోస్టల్ స్టాంప్ ఆకృతి కనువిందు చేసింది. కళ్లు చెదిరేలా ఆకాశంలో నుంచి విమానం ఆకృతిలో వేలాది డ్రోన్లు దూసుకొచ్చాయి. ఆకాశం నుంచి ఒక్కసారిగా ఉట్టిపడినట్లు గౌతమబుద్ధుని ప్రతిమ డ్రోన్లతో దర్శనమిచ్చింది. ప్రదర్శన తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

డ్రోన్ల సాంకేతికత గేమ్‌ ఛేంజర్‌ -రాబోయే కాలంలో సమాచారమే విలువైన సంపద: చంద్రబాబు

భారతదేశం మ్యాప్‌ ఆకృతిలో డ్రోన్ల ప్రదర్శన: ప్రపంచం పటంపై భారతదేశం మ్యాప్​తో ఆకాశంలో డ్రోన్లు గింగరాలు తిరిగాయి. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగంపై డ్రోన్ల ఆకృతి ప్రదర్శన ఆకట్టుకుంది. అమరావతి డ్రోన్ హ్యాకతాన్ విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నగదు నజరానా అందించారు. మా తుజే సలామ్ అంటూ సాగిన లేజర్ షో అందరినీ అబ్బురపరిచింది. జయహో అమరావతి అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ప్రదర్శన ముగిసే సమయంలో కళ్లు మిరుమిట్లు కొలిపేలా బాణాసంచా ఆకట్టుకుంది. డ్రోన్ ప్రదర్శన, లేజర్ షో, బాణసంచా వేడుక అంగరంగ వైభవంగా ముగిసింది. డ్రోన్ షో తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.

Guinness records
Guinness records (ETV Bharat)

మైమరచిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు: అంతకుముందు విజయవాడ కృష్ణ నది తీరంలో డ్రోన్ సమ్మిట్ 2024లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణం వందే జగద్గురం అంటూ సాగిన కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు దశావతారాలను కళ్లకు కట్టినట్లు నృత్య ప్రదర్శన చేశారు. నాటు నాటు అంటూ విన్యాసాలతో వికాస్ అన్ బీటబుల్ టీమ్ ఆక్రోబాట్స్ చూపరులను ఆకట్టుకున్నాయి. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మైమర్చిపోయి వీక్షించారు.

'మారుమూల గ్రామాలకూ వైద్య సేవలు - 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే రెడ్ వింగ్ డ్రోన్లు'

Last Updated : 8 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.