ETV Bharat / state

భాష పురోగమనంతోనే సాహిత్య సంపద పెరుగుతుంది : వెంకయ్యనాయుడు - Literature Conference Kakinada

All India Telugu Literature Conference in Kakinada : భావాలను వ్యక్తపరచడానికి భాష చాలా ముఖ్యం. అలాంటి భాష తెలుగు సాహిత్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. భాష లేకపోతే అభివృద్ది ఉండదు. ఎక్కడ భాషా జ్ఞానం పెంపొందుతుంతో, ఎక్కడ తెలుగు భాషా పురోగమనం జరగుతుందో అక్కడ సాహిత్య సంపద పెరుగుతుంది.

all_india_telugu_literature_conference_in_kakinada

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 4:09 PM IST

All India Telugu Literature Conference in Kakinada : నేటి తరం ఆంగ్ల భాషకు ఇచ్చిన ప్రాముఖ్యత మాతృ భాషకు ఇవ్వడం లేదు. భాష వ్యక్తీకరణ మాత్రమే కాకుండా తెలుగు జాతి సంస్కృతికి భాష అద్దం పడుతుందంటారు పెద్దలు. కానీ సాహిత్యాన్ని మాత్రం కవులు పలు భాషల్లోకి అనువాదం కూడా చెయ్యడం ముఖ్యమంటున్నారు మరికొందరు భాషా కోవిదులు. కాకినాడలో జరిగిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు సాహితీవేత్తలు పాల్గన్నాారు. వారు సాహిత్యానికి (Literature), సమాజానికి భాష ఏ విధంగా దోహదపడుతుందని వివరించారు.

సాహిత్యమే ఆయుధంగా బతికిన 'ఆశాజీవి' గొల్లపూడి

Venkaiah Naidu in All India Telugu Literature Conference : భావ వ్యక్తీకరణకు భాష ఎంతో తోడ్పడుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. భాష లేనిదే సమాజం అభివృద్ధి చెందలేదని సంస్కృతి ఎల్లలు దాటదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా వచ్చే రచయితలు తమ రచనలకు మార్కెటింగ్ చేసుకోవడం ఎంతో ముఖ్యమని ప్రతిఒక్కరూ తమ రచనలు హిందీలో అనువాదం అయ్యేలా చూసుకోవాలని ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ (Yarlagadda LaxmiprasaD) అన్నారు. నాడు తాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనధికార తీర్మానం వల్లే నేడు పాఠశాలల్లో తెలుగు భాష తప్పనిసరిగా బోధిస్తున్నారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గుర్తుచేశారు.

భాష పురోగమనంతోనే సాహిత్య సంపద పెరుగుతుంది : వెంకయ్యనాయుడు

అనువాద సాహిత్యంతో మరింత సాన్నిహిత్యం

'భాష ఏమిటనే ప్రశ్నకు ప్రతీ ఒక్కరూ సమాాధానం తెలుసుకుంటే చాలు మన మాతృభాషలోని గొప్పతనం మనకు అర్థమవుతుంది. అనుభూతులు కట్టలు తెంచుకుని పొంగుకొస్తున్నప్పుడు మనసునీ మనసుని కలబోసి మనిషినీ మనిషినీ కలిపి ఒక జట్టుగా బృందంగా సమూహంగా చివరకు ఒక సమాజంగా పట్టి ఉంచే శక్తి, ఒక మహత్తరమైనటువంటి సాధనం ఒక్క భాష మాత్రమే అని నేను భావిస్తున్నాను. భాష భావ వ్యక్తీకరణకు ఉపయోగపడుతుంది. వివిధ చారిత్రక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక కారణాల వల్ల వ్యక్తీకరణ అనేక రకాలుగా జరుగుతుంది. భాషలో కేవలం వ్యక్తీకరణే కాక మన సంస్కృతి కూడా దాగి ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి నాగరికత తన గొప్పతనాన్ని భాష ద్వారా వ్యక్తం చేస్తుంది. మన ఆటలూ, పాటలూ, కళలూ, పండుగలు, వ్యాపార సంబంధాలు ఇవన్నీ భాష లేకుండా రూపొందలేవు. భాష సమాజన్ని సృష్టింస్తుంది. జాతిని బలపరుస్తుంది. అభివృద్ధికి మార్గం వేస్తుంది. బండికి ఇరుసు ఎంత ముఖ్యమో సామాజిక పరిణామంలో భాష అంత కీలకమైంది.' - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

'తెలుగు సాహిత్యంలో ఇనాక్​ది కొత్త ఒరవడి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.