ETV Bharat / state

'ఇక్కడి అబ్బాయి'ని కలిసేందుకు వచ్చిన 'అక్కడి అమ్మాయి'!- పవన్, సుప్రియ భేటీపై సరదా కామెంట్లు - Supriya met Pawan Kalyan - SUPRIYA MET PAWAN KALYAN

Akkada Ammayi Ikkada Abbayi heroine met Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల సమావేశంలో ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. పవన్ కల్యాణ్ మొదటి సినిమాలో నటించిన హీరోయిన్ ఈ సమావేశంలో ఉండటం విశేషం. తాజాగా ఆ చిత్రాలు బయటకు రావడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో ఆ చిత్రాలను పోస్ట్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే?

supriya_meet_pawan_kalyan
supriya_meet_pawan_kalyan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 5:46 PM IST

Updated : Jun 24, 2024, 5:53 PM IST

Akkada Ammayi Ikkada Abbayi heroine met Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ నటించిన మొదటి సినిమాలోని హీరోయిన్ ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. ఆమె మరెవరో కాదు యార్లగడ్డ సుప్రియ. ఈమె 1996లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ సరసన హీరోయిన్​గా నటించారు. ఆ సినిమా ఇద్దరికీ మొదటి సినిమా అవడం విశేషం.

ఆ తరువాత సుప్రియ మరే సినిమాలో హీరోయిన్​గా నటించలేదు. ఆ తరువాత వీరు ఎక్కడా కూడా కలవలేదు. కాగా తాజాగా జరిగిన నిర్మాతల సమావేశంలో ఇరువురూ కలవడం పవర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించింది. ఇక్కడి అబ్బాయిని కలిసిన అక్కడ అమ్మాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు. ఈ సమావేశంలో చర్చించుకుంటున్న చిత్రాలు రావడంతో వాటితో తమ అభిమాన తారలను చాలా కాలం తర్వాత కలవడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ చిత్రాలను పోస్ట్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.

ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఎలా? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​తో భేటీ అయిన సినీ నిర్మాతలు - Producers Meeting with Pawan Kalyan

Power Star Pawan Kalyan: పవన్ కల్యాణ్ అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. సినిమాలలో ట్రెండ్ సెట్ చేసిన పవన్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాలు అలస్యం అయ్యాయి. ఇకపోతే పవన్ రాజకీయాల్లో ఉండటం వల్ల సినిమాలకు దూరమయ్యారని అభిమానుల్లో నిరాశ కూడా ఉంది.

Yarlagadda Supriya: యార్లగడ్డ సుప్రియ ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో హీరోయిన్​గా నటించిన సుప్రియ తరువాత తెరపై కనిపించ లేదు. ప్రస్తుతం ఆమె కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా ఆమె తన తాత స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్​లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుప్రియ సారధ్యంలో అన్నపూర్ణ స్టూడియో దేశంలోనే అత్యంత అధునాతన స్టూడియోలలో ఒకటిగా మారింది. సుప్రియ ఇప్పటి వరకు 17 చిత్రాలను నిర్మించారు. వీటిలో చాలా వరకు క్లాసికల్ సినిమాలుగా రూపొందాయి. సుప్రియ మంచి కంటెంట్ కలిగిన చిత్రాలను ఇందించే నిర్మాతలలో ముందుంటారు అనడానికి ఆమె నిర్మించిన చిత్రాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

'ఎర్రచందనం స్మగ్లింగ్​'పై పవన్​ కీలక ఆదేశాలు- పారిశ్రామిక కాలుష్యంపైనా మంత్రి సమీక్ష - pawan kalyan on Red Sandalwood

జనవాణికి వచ్చే సమస్యల పరిష్కారాలను నేరుగా పర్యవేక్షిస్తోన్న డిప్యూటీ సీఎం పవన్ - Pawan Kalyan Janavani

Last Updated : Jun 24, 2024, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.