ETV Bharat / state

"సైకిల్ మే సవాల్" - వేల కిలోమీటర్లు దూసుకెళ్తున్న సాహసికులు - CYCLING BENEFITS

వినోదం, ఆరోగ్యం కలగలిసిన సైక్లింగ్ హాబీ - సామాజిక కార్యక్రమాల్లోనూ సైక్లింగ్ క్లబ్​లు

bicycle_challenge_and_events
bicycle_challenge_and_events (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2024, 1:09 PM IST

Bicycle Challenge and Events : ఇప్పుడంటే సెల్​ఫోన్లు, వీడియో గేమ్​లు, స్పోర్ట్స్ సైకిళ్లు, బైకులు వచ్చాయి గానీ, 30 నుంచి 40 ఏళ్ల కిందట పిల్లల పరిస్థితి వేరు. గంట, అరగంట పాటు సైకిల్ అద్దెకు తీసుకుని సరదా తీర్చుకునేవారు. సొంతంగా సైకిల్‌ కొనుక్కోలేని అవకాశాల్లేక అద్దె సైకిళ్లపై ఆధారపడేవారు. కానీ, రోజులు మారిపోయాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సైకిళ్లే కాదు స్పోర్ట్స్ బైకులు, కార్లు కొనిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనూ కొందరు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఒత్తిడిని జయించడానికి, శరీర వ్యాయామం, మైండ్ రీఫ్రెష్​మెంట్ దిశగా సైకిల్‌ తీసుకుని అలా వందల కిలోమీటర్లు వెళ్లిపోతున్నారు. సరదా కోసం సైక్లింగ్ మొదలుపెట్టినవారిలో కొందరు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నారు.

యువతీయువకులే కాదు.. మధ్య వయస్సు, ఏడు పదుల పైబడినవారు సైతం సైకిళ్లపై దూసుకుపోతున్నారు. తామేం తక్కువ కాదంటూ రోజుల తరబడి నిర్వహించే పోటీల్లో మగువలూ పాల్గొని విజేతలుగా నిలుస్తున్నారు. ప్రైజ్‌మనీ లేకున్నా సొంత ఖర్చుతో బెంగళూరు, గోవా, పారిస్, లండన్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు.

సైక్లింగ్ vs రన్నింగ్ - ఈ రెండిట్లో ఫిటినెస్​కు ఏది మంచిది? - Cycling vs Running For Fitness

రాష్ట్రంలోని పలు నగరాల్లో దాదాపు 250 మంది సైక్లిస్టులు వివిధ క్లబ్బుల్లో సభ్యులుగా ఉన్నారు. పోటీల్లో పాల్గొనాలనే ఉద్దేశం లేకున్నా వ్యాయామం, ఆరోగ్యం, ఆహ్లాదం కోసం వెళ్తున్నారు. అడాక్స్‌ అనే అంతర్జాతీయ క్లబ్‌ నిర్వహణ సంస్థ సైక్లింగ్‌లో ప్రతిష్ఠాత్మక పోటీలు నిర్వహిస్తోంది. ఒకే ఏడాది నిర్వహించే 200, 300, 400, 600 కిలో మీటర్ల పోటీల్లో విజేతలను సూపర్‌ రాండోనీర్‌ అని పిలుస్తారు. ఈ సూపర్‌ రాండోనీర్‌ నాలుగేళ్లకోసారి పారిస్‌లో నిర్వహించే 1,200 కిలో మీటర్ల సైక్లింగ్ పోటీలకు అర్హత సాధిస్తారు. ఈ పోటీని 90 గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. నాలుగేళ్లకోసారి లండన్‌లో 1,500 కి.మీ., బ్యాంకాక్‌లో ప్రతి సంవత్సరం 2వేల కి.మీ. సైక్లింగ్ పోటీలు ఉంటాయి. ఇటలీ టు నార్త్‌కేప్‌ (నార్వే) వరకు నిర్వహించే సైక్లింగ్ పోటీ యూరప్​ ఖండంలోని ఆరు దేశాల మీదుగా సాగుతుంది. 4వేల కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ పోటీని 21 రోజుల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.

సామాజిక స్పృహ

గుడివాడలో మూడు సంవత్సరాల కిందట ముగ్గురితో ప్రారంభమైన సైకిల్‌ క్లబ్‌ ప్రస్తుతం 60మంది సభ్యులకు చేరింది. ఈ క్లబ్​లో మహిళలు, 15-65 ఏళ్లవారు కూడా ఉన్నారు రోజూ 40 కి.మీ., వీకెండ్స్​లో 100 కిలో మీటర్ల రైడ్​కు వెళ్తున్నారు. అయితే, సైక్లింగ్‌కే పరిమితం కాకుండా గోళీలు, ఏడు పెంకులు(సెవెన్ పిక్స్), కర్ర బిళ్ల, బొంగరాల్లాంటి ఆటలతో బాల్యం అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటడం, మొక్కలను కాపాడిన పాఠశాలలకు పుస్తకాలు, గ్రంథాలయాలూ అందజేస్తూ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. క్లబ్‌లో బ్యాంకు ఉద్యోగులు, వైద్యులు.. యువకులు, చిన్నారులకు ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్య జాగ్రత్తలు సూచిస్తున్నారు. అమరావతి రన్నర్స్‌ క్లబ్‌ విజయవాడ సైక్లిస్టులు పేద విద్యార్థుల ఫీజులు చెల్లిస్తున్నారు.

కదలికతో మోకాళ్లకు ప్రయోజనం

నెలల పాటు సాధన చేసిన సైక్లిస్టులు ఎంతో ఆరోగ్యంతో ఉంటారు. ప్రారంభంలోనే సైకిల్‌పై ఎక్కువ ప్రయాణిస్తే డీ హైడ్రేషన్, మోకాళ్లు, కండరాల నొప్పులు ఉంటాయని తెలుసుకోవాలి. సైకిల్​పై ఎంత దూరమైనా వెళ్లొచ్చని, దీనివల్ల మోకాళ్లలో అరుగుదల ఉండదని ఏలూరుకు చెందిన సీనియర్‌ ఆర్థోపెడిక్‌ వైద్యుడు ఏఆర్‌ మోహన్ తెలిపారు. కదలిక ఉంటేనే మోకాళ్లకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆయన వెల్లడించారు.

వెయ్యి కి.మీ. పూర్తిచేసిన తొలి మహిళ..

కాకినాడ పట్టణానికి చెందిన 46ఏళ్ల అనిత గృహిణి. అనారోగ్య సమస్యలు ఉండటంతో గతంలో వాకింగ్‌ చేసేది. సైక్లింగ్‌ చేయాలని వైద్యుడు సూచించడంతో ప్రారంభంలో రోజూ 10-20 కిలో మీటర్లు వెళ్లేది. ఆ తర్వాత అన్నవరం, చేబ్రోలులో జరిగే పోటీల్లో పాల్గొనేది. ఈ క్రమంలో సూపర్‌ రాండోనీర్‌ (200, 300, 400, 600 కిలో మీటర్లు) కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత అమరావతి రాండోనీర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వెయ్యి కిలోమీటర్ల పోటీలో కూడా పాల్గొంది. గుంటూరు నుంచి కరీంనగర్‌ వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది. 75 గంటల ఈ పోటీలో పాల్గొన్న ఆమె హైవే మీద రాత్రిళ్లు భారీ వాహనాలు వెళ్తున్నా ధైర్యంగా కొనసాగించి విజేతగా నిలిచారు. సైకిల్‌కు పంక్చర్‌ వేయడం, రిపేర్లు చేయడం కూడా నేర్చుకున్నానని, వచ్చే సంవత్సరం లండన్‌లో నిర్వహించే 1,500 కి.మీ. పోటీలో పాల్గొంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు అనిత.

సైకిల్‌తో ప్రయోజనాలు..

  • త్వరగా బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.
  • శరీంలోని అవయవాలు వేగంగా కదులుతాయి. కాళ్లపై ఒత్తిడి పడదు.
  • కీళ్ల వ్యాధులు ఉన్నవారికి మంచి వ్యాయామం.
  • బరువు తగ్గి, మంచి శరీరాకృతి రావడంతో పాటు మధుమేహం, రక్తపోటు అదుపులోకి వస్తాయి.
  • దూర ప్రాంతాలకు వెళ్తే ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఉంటుంది.

సైక్లింగ్​తో గుండె, లంగ్స్​ మరింత పదిలం- ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు! - Health Benefits Of Cycling

మంచుపై సైకిల్ యాత్ర- 9వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆలయంలో పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.