Accident at Shilparam in Tiruchanur of Tirupati District: తిరుపతి రూరల్ తిరుచానూరు పరిధిలోని శిల్పారామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రాస్ వీల్లో ఇద్దరు మహిళలు కూర్చొని తిరుగుతుండగా ఒక్కసారిగా విరిగిపోయి కుప్పకూలింది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన మహిళ సుబ్బారెడ్డి నగర్‍కు చెందిన లోకేశ్వరిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తిరుచానూరు పోలీసులు విచారణ చేపట్టారు.
ఆటోలు ఢీకొని ఇద్దరు మృతి: కర్నూలు జిల్లా ఆదోని మండలం గనేకల్లు వద్ద రెండు ఆటోలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. 7 తీవ్రంగా గాయపడ్డారు. దైవదర్శనం కోసం ఉరుకుంద ఈరన్న దేవాలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు కర్ణాటకవాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
శిథిలావస్థలో అంబులెన్సులు- నిర్వహణను పట్టించుకోని గుత్తేదారు సంస్థ
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లపాడు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి కారు బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో కనకదుర్గ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెనుక సీటులో కూర్చున్న శ్రీ లక్ష్మీకి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ట్రాక్టర్ను ఢీ కొట్టిన బైక్ : అనంతపురం జిల్లా ఉరవకొండలోని రాములమ్మ ఆలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంజి తన స్నేహితులు నరసింహ, సాయితేజతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఆగి ఉన్న పెళ్లి ట్రాక్టర్ను బలంగా ఢీ కొట్టారు. ప్రమాదంలో అంజి అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ట్రాక్టర్ వెనుక వైపు కూర్చున్న నాగరాజుకు తీవ్ర గాయలయ్యాయి. అంజి మృతిపై మంత్రి పయ్యావుల కేశవ్ సంతాపం తెలిపారు.
కారు బీభత్సం: కృష్ణా జిల్లా పోరంకిలో కారు బీభత్సం సృష్టించింది. కాకినాడకు చెందిన ఇద్దరు వైద్యులు విజయవాడ సంగీత్ ఉత్సవంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో మద్యం సేవించి కారు నడిపారు. మద్యం మత్తులో పోరంకిలోని మసీదు దగ్గర ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. దీంతోపాటు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని గుద్దుకుంటూ అక్కడే నిలిపి ఉంచిన అరటి పండ్ల బండిని ఈడ్చుకుంటూ వెళ్లారు. అక్కడితో ఆగకుండా మరో బైక్ను ఢీ కొట్టారు. బైక్పై ఉన్న వంట మనుషుల్లో ఒకరి కాలు మధ్య వరకు తెగిపోగా, మరొకరి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడ అక్రమమట్టి దందా ఇలా! నిగ్గు తేల్చిన అధికారులు- భారీ మొత్తంలో జరిమానా