ETV Bharat / state

భార్య, కుమార్తెను చంపి భర్త ఆత్మహత్య- ఏం జరిగిందంటే? - MAN KILLS WIFE AND DAUGHTER IN HYD - MAN KILLS WIFE AND DAUGHTER IN HYD

Husband Kills Wife And Daughter in Secunderabad : సికింద్రాబాద్​ బోయిన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. భార్య, 10 నెలల పసికందును చంపిన ఓ వ్యక్తి అనంతరం రైల్వేట్రాక్​పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

husband_kill_wife
husband_kill_wife (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 11:43 AM IST

Husband Kills Wife And Daughter : కట్టుకున్న భార్య, కుమార్తెపైనే అతి కర్కశంగా ప్రవర్తించి దారుణ హత్యకు ఒడిగట్టాడు ఓ వ్యక్తి. అనంతరం తాను కూడా రైల్వే ట్రాక్​పైపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సికింద్రాబాద్​ బోయిన్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పల్నాడులో యువకుడు దారుణ హత్య - సంఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ - Young Man Murder

ఏసీపీ గోపాలకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గణేశ్ అనే వ్యక్తి​ గత మూడేళ్లుగా భార్య, కుమార్తెలతో కలిసి బోయిన్​పల్లి ఆర్య సమాజం వద్ద ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గణేశ్​ కుటుంబ పోషణ రీత్యా ఆటో డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అయితే చక్కగా సాగుతున్న వారి సంసారంలో అభిప్రాయబేధాలు వచ్చాయి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి భార్య స్వప్న, 10 నెలల చిన్నారి నక్షత్రను గణేశ్ గొంతునులిమి చంపేశాడు.

ఒకే కుటుంబంలో ముగ్గురి మరణంతో విషాదఛాయలు : భార్య, కుమార్తెను చంపిన అనంతరం సుచిత్ర రైల్వే ట్రాక్​పై గణేశ్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే భార్యపై అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురి మరణంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో వారు అనాథలయ్యారు.

తిరుపతిలో దారుణం - దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి - వృద్ధురాలు మృతి

"ఈ రోజు 5 గంటలకు గణేశ్​ అనే ఆటో డ్రైవర్​ 100కు డయల్​ చేసి తన భార్యా బిడ్డలను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. వెంటనే స్పందించిన పోలీస్ పెట్రోలింగ్​ టీమ్​ అప్రమత్తమయ్యారు. అతడి ఇంటిదగ్గరకు పోలీసులు చేరుకునేసరికి స్నప్న, నక్షత్రలు అచేతనంగా పడి ఉన్నారు. గణేశ్​ కూడా సుచిత్ర రైల్వేస్టేషన్​ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటికే వారు చనిపోయినట్లుగా అంబులెన్స్​ సిబ్బంది నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నాం." - గోపాలకృష్ణ, బేగంపేట్​ ఏసీపీ

'నేను చేసిన తప్పును నా భర్త, అత్తామామలు క్షమించినా - మా పిన్ని దుష్ప్రచారాన్ని తట్టుకోలేకపోతున్నాం' - Couple committed suicide

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.