ETV Bharat / state

ఈత నేర్పిస్తామని చెప్పి నీట ముంచారు - BOY KILLED TO EXTRAMARITAL AFFAIR

తిరుపతి జిల్లాలో దారుణం - వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బాలుడి హత్య

Boy killed Due to Extramarital Affair
Boy killed Due to Extramarital Affair (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2024, 9:00 AM IST

Boy killed Over Extramarital Affair : నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. ఆ మోజులో పడి ఎంతోమంది తమ పండంటి కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఓ వైపు ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సైతం సిద్ధపడుతున్నారు. మరోవైపు అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా క్షణిక సుఖాల కోసం కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. తద్వారా జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయనడానికి తాజాగా ఈ ఘటనే ఓ ఉదాహరణ.

తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి బిడ్డ అడ్డుగా ఉన్నాడన్న నెపంతోనే బాలుడిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గూడూరు డీఎస్పీ వీవీ రమణకుమార్‌ బుధవారం గ్రామీణ సీఐ కిషోర్‌బాబు, ఎస్సై సురేష్‌బాబుతో కలిసి వివరాలను వెల్లడించారు. చిల్లకూరు మండలం వరగలి గ్రామానికి చెందిన బాలుడు కాతారి లాసిక్‌(11) ఈ నెల 7 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరుసటి రోజు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం వద్ద కండలేరు కాలువలో లాసిక్ శవమై తేలాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోట మండలం కొక్కుపాడు గ్రామానికి చెందిన కాతారి అనిల్​కి బాలుడి తల్లితో వివాహేతర సంబంధం ఉంది. దాంతోపాటు ఆమెకున్న ఆస్తిపై అతడు కన్నేశాడు. దానిని సొంతం చేసుకునేందుకు తనతో వచ్చి ఉండమని కోరాడు. బిడ్డను వదిలి రాలేనని ఆమె చెప్పింది.

Chillakur Boy Kidnap Case Updates : ఈ క్రమంలోనే అనిల్​ లాసిక్‌ను హతమార్చేందుకు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ ప్లాన్ రూపొందించాడు. ఈ నేపథ్యంలోనే ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని వరగలి గ్రామానికి చెందిన బైనా చరణ్‌ సాయంతో సమీపాన ఉన్న ఉప్పుటేరు వద్దకు ఈత నేర్పిస్తామని తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి లాసిక్‌ను నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. మంగళవారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు.

వివాహేతర సంబంధం - భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య

వివాహేతర సంబంధం - తీసింది ఇద్దరి ప్రాణం - extra marital relationship suicide

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.