ETV Bharat / state

ఇంటికెళ్దాం లే కన్నయ్యా - మృతి చెందిన కుమారుడి పక్కన తల్లి రోదన - ROAD ACCIDENT IN ANNAMAYA

రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతి - నమ్మలేక మృతదేహంతోనే తల్లి సంభాషణ

ROAD_ACCIDENT_IN_ANNAMAYA
ROAD_ACCIDENT_IN_ANNAMAYA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2024, 10:47 AM IST

5 Years Old Boy Died in Road Accident in Annamayya District : హాస్పిటల్​​ బెడ్‌పై కుమారుడి పక్కన పడుకుని బాబు నిద్రపోతున్నాడంటూ ఆ తల్లి జోకొడుతోంది. కాసేపట్లో అందరం ఇంటికి వెళిపోతామనీ చెబుతోంది. కానీ ఆ చిన్నారిని రోడ్డు ప్రమాదం కబళించిందని, ఇక మళ్లీ తనని అమ్మా అని పిలవలేడని ఎవరు చెప్పినా ఆ తల్లి మనసుకు పట్టడం లేదు. ఓ వైపు కన్నీరు కారుస్తూనే మరో వైపు భ్రమతో చిన్నారి మృతదేహం పక్కనే కూర్చుని కుమారుడితో సంభాషిస్తూ ఉండిపోయింది. అందరినీ కంటతడి పెట్టించిన ఈ హృదయవిదారక సంఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.

విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం - ఒకరి మృతి, 11 మందికి గాయాలు

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడులో బాబూరామ్, శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు. ఇరువురు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు (3) ఇటీవల అనారోగ్యానికి గురవడంతో పిల్లలు ఇద్దరితో కలిసి బైక్​పై సోమవారం (అక్టోబర్​ 7న) రాజంపేటలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్​కి వెళ్లారు. అక్కడ చిన్నారి చికిత్స అనంతరం తిరిగి ఇంటికి పయనం అయ్యారు. ఈ క్రమంలోనే బైక్‌ అదుపు తప్పిడంతో అంతా కింద పడిపోయారు. బైక్​లో ముందు భాగంలో కూర్చున్న పెద్ద కుమారుడు శ్యామ్‌(5) ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - డ్రైవర్ మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

స్థానికులు గమనించి హుటహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వైద్య సిబ్బంది శ్యామ్‌ మృతదేహాన్ని ఆసుపత్రిలో బెడ్‌పై ఉంచారు. తన చిన్నారిని రోడ్డు ప్రమాదం కబళించిందన్న విషయం మర్చిపోయి తల్లి శిరీష అతడి పక్కనే పడుకుని కన్నయ్యా ఎంత సేపు పడుకుంటావు నిద్రలే అని పిలుస్తూ భ్రమలోనే ఉండిపోయింది. చిన్నారి తండ్రి బాబూరామ్​ ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళదామని చెప్పడంతో ఆయనా విలపిస్తూ ఉండిపోయారు. ఈ హృదయ విదారక సంఘటన స్థానికులు సైతం కంటతడి పెట్టించింది.

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు - ROAD ACCIDENTS IN AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.