Deputy Collectors Transfers in AP : ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లకు ఏపీ సీఆర్డీఏలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ ప్రోటోకాల్ డైరెక్టర్గా టి.మోహన్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పి.రచనను నియమించారు. శ్రీకాళహస్తి దేవాలయం ఈఓగా టి.బాపిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ శిల్పారామం సొసైటీ సీఈఓగా వి.స్వామి నాయుడును నియమించారు. సీసీఎల్ఏ సహాయ కార్యదర్శిగా డి.లక్ష్మా రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
తెలంగాణ నుంచి వచ్చిన IASలకు పోస్టింగ్లు - ఆమ్రపాలికి ఏ శాఖ ఇచ్చారంటే?
ఐఏఎస్ అధికారుల బదిలీ- మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్గా ఎన్.తేజ్ భరత్ - IAS Officers Transfer in AP