22 Lakh Cash Seized in APSRTC : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నుండి జంగారెడ్డిగూడెం వచ్చిన ఏపీఎస్ఆర్టీసీ కార్గో బస్సులో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 22 లక్షల రూపాయలు నగదును జంగారెడ్డిగూడెం పోలీసులు, ఎన్నికల అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ కార్గో బస్సులో నగదు తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ షాపు వద్ద కార్గోలోని పార్సిల్స్ దింపుతూ ఉండగా బస్సులో సోదాలు చేశామని తెలిపారు.
ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు - భారీగా పట్టుబడుతున్న నగదు, బంగారం - POLICE CHECKING THE VEHICLES
ఈ సోదాలలో డ్రైవర్ వద్ద ఎటువంటి బిల్లులు, ఆధారాలు లేకుండా అనధికారికంగా ఉన్న 22 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీనిపై డ్రైవర్ని వివరణ అడగగా డ్రై ఫ్రూట్ అని జంగారెడ్డిగూడెం బైపాస్‌లో ఒక వ్యక్తికి అందజేయమని వాటిని హైదరాబాదులో ఇచ్చారని అన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 22 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కార్గో బస్సును పోలీస్ స్టేషన్ తరలించమని అన్నారు. దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ప్రైవేటు బస్సులో భారీగా నగదు తరలింపు- సెబ్ అధికారుల తనిఖీల్లో రూ.60లక్షలు స్వాధీనం
EC Seized Money Liquor and Drugs in AP : ఎన్నికల కోడ్ అమలు నుంచి ఇప్పటి వరకూ 47.5 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, వెండి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివిధ చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ 17.5 కోట్ల రూపాయల మేర నగదు స్వాధీనం అయినట్లు వెల్లడించారు. 5 లక్షల 13 వేల లీటర్ల మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
తనిఖీల్లో ఎన్నికల్లో పంచిపెట్టే ఉచితాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. సీజర్లకు సంబంధించి 4337 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఉల్లంఘనలకు సంబంధించి 247 ఎఫ్ఐర్లు నమోదు అయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 8 వేల 681 లైసెన్సుడు ఆయుధాలను ఆయా పోలీసు స్టేషన్లలో జమ చేశారని వివరించారు.