ETV Bharat / spiritual

వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు టీటీడీ బహుమతులు - Varalakshmi Vratam

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 1:31 PM IST

Varalakshmi Vratam : శ్రావణ మాసం పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీన శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరగనుంది. ఈ వ్రతంలో పాల్గొనే భక్తులకు కానుకలు అందజేయనున్నారు.

varalakshmi_vratam
varalakshmi_vratam (ETV Bharat)

Varalakshmi Vratam : శ్రావణ మాసం పురస్కరించుకుని తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వ్రతంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న దంపతులకు పలు కానుకలు అందజేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీన శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరగనుంది. వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, లడ్డూ, వడ బహుమతిగా అందజేస్తారు.

Gold Rate Today 25th August 2023 : వరలక్ష్మీ వ్రతం వేళ స్థిరంగా బంగారం.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

మహామంగళ దేవత, లక్ష్మీ అవతారమైన అలమేలు మంగమ్మ తిరుచానూరు ఆలయంలో జగత్కల్యాణం కోసం అవతరించిన సౌభాగ్యదేవత. తిరుచానూరులో జరిగే వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు విశేషమైన ఫలితాలు సమకూరుతాయి అని అర్చకులు వెల్లడిస్తున్నారు. వ్రతం చేసే రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి ఆలయంలో అర్చకులు ఏర్పాటు చేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీ దేవిని దర్శించాలి.

అర్చకులు మంటపంలో ముగ్గులలో కమలాన్ని ఏర్పాటు చేస్తారు. దాని మధ్యలో కలశాన్ని ఉంచి, దానిపై నారికేళ ఫలాన్ని పెట్టి, దానికి చెవులు, కన్నులు, ముక్కు ఏర్పాటు చేసి ఆభరణాలను అలంకరిస్తారు. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తారు. రక్ష కట్టిన తరువాత పసుపు, కుంకుమ, పూలతో వ్రతాన్ని సుసంపన్నం గావించి, వ్రతమహత్యం కథను కూడా చక్కగా పఠించడం జరుగుతుంది.

Varalakshmi Vratam Story : విశ్వమంతా లక్ష్మీమయం

తిరుచానూరు.. వరాల తల్లికి వ్రత పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.