ETV Bharat / spiritual

నాగుల చవితి స్పెషల్​ ప్రసాదాలు - రుచికరమైన చలిమిడి, చిమ్మిలి - ఇలా చేస్తే నిమిషాల్లో ప్రిపేర్​! - NAGULA CHAVITHI PRASADAM RECIPES

-నాగుల చవితి రోజు ప్రత్యేకంగా చేసే ప్రసాదాలు ఇవే -చవితి రోజు నాగేంద్రుడిని పూజ చేస్తే నాగదేవతల అనుగ్రహం

Nagula Chavithi Prasadam Recipes
Nagula Chavithi Prasadam Recipes (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 5:24 PM IST

Nagula Chavithi Prasadam Recipes: హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో నాగుల చవితి ఒకటి. కార్తిక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజు ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఈ ఏడాది నాగుల చవితి నవంబర్​ 5వ తేదీన జరుపుకోనున్నారు. ఈ క్రమంలో మహిళలు నాగేంద్రుడికి పూజలు చేసి, పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పిస్తారు. నాగుల చవితి నైవేద్యాలు అంటే చలిమిడి, చిమ్మిలి, వడపప్పు గుర్తుకువస్తాయి. ఇక వాటిని ఎంతో మంది ఎన్నో రకాలుగా తయారు చేస్తుంటారు. కానీ ఈ పద్ధతిలో చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. పైగా నిమిషాల్లో ప్రిపేర్​ చేసుకోవచ్చు. మరి ఈ నైవేద్యాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్​ ఎలానో ఇప్పుడు చూద్దాం..

1. చలిమిడి కావాల్సిన పదార్థాలు:

  • తడి బియ్యం పిండి - 1 కప్పు
  • బెల్లం తురుము - అర కప్పు
  • యాలకుల పొడి - చిటికెడు
  • నెయ్యి - 1 టేబుల్​ స్పూన్​

చలిమిడి తయారీ విధానం:

  • ముందుగా తడి బియ్యప్పిండిని రెడీ చేసుకోవాలి. ఈ ప్రసాదం ప్రిపేర్​ చేసే ముందు రోజు రాత్రి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
  • తెల్లారి మరోసారి కడిగి వాటర్​ లేకుండా ఫ్యాన్​ గాలికి ఆరబెట్టి మిక్సీ జార్​లోకి వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి.
  • ఇలా చేసుకున్న పొడిని ఓ బౌల్​లోకి వేసుకుని అందులోకి బెల్లం తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. ఒకవేళా చలిమిడి ముద్ద ఏమైనా లూజుగా ఉంటే మరికొంచెం తడి బియ్యప్పిండిని కలుపుకోవాలి. అంతే చలిమిడి రెడీ.
  • ఇదే చలిమిడిని పొడి బియ్యప్పిండితో కూడా చేసుకోవచ్చు. అదెలాగంటే.. మిక్సీజార్​లో బియ్యం, బెల్లం తురుము వేసి గ్రైండ్​ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని వాటర్​ యాడ్ చేస్తూ పిండిని గట్టిగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • అలా గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్​లోకి తీసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుంటే చలిమిడి రెడీ.

2. చిమ్మిలి కోసం:

  • నువ్వులు - 1 కప్పు
  • బెల్లం తురుము - అర కప్పు

తయారీ విధానం:

  • మిక్సీ జార్​లోకి నువ్వులు వేసి కొంచెం బరకగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి బెల్లం తురుము వేసి మరోసారి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఈ నువ్వుల మిశ్రమాన్ని ప్లేట్​లోకి తీసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. ఆ ముద్దలో కొంతపిండిని తీసుకుని లడ్డూలుగా చేసుకోవాలి. అంతే చిమ్మిలి లడ్డూలు రెడీ.

3. వడపప్పు:

  • శనగపప్పు - అర కప్పు
  • బెల్లం తురుము - కొద్దిగా

తయారీ విధానం:

  • ఈ ప్రసాదం ప్రిపేర్​ చేసే ముందు రోజు రాత్రి శనగపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
  • ఆ మరుసటి రోజు మరోసారి శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఓ బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి బెల్లం తురుము కలుపుకుంటే వడపప్పు రెడీ. ఈ వడపప్పును పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు.

కార్తిక మాసంలో బిల్వ పత్రాలతో శివపూజ - అనంత కోటి పుణ్యఫలాలు, అష్టైశ్వర్యాలు మీ సొంతం!

నాగుల చవితి పర్వదినం - ఈ విధంగా పూజ చేస్తే రాహుకేత దోషాలన్నీ తొలగిపోతాయట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.