YSRCP Leaders Casting Fake Votes in Tirupati District: తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బ్రాహ్మణకాలువలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యేను తిరిగి కొట్టిన ఓటర్ - MLA Beat Voter
దొంగ ఓట్ల పరంపర: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్ల పరంపర కొనసాగుతోంది. మంగమ్మ అనే వృద్ధురాలు తన ఓటును ఎవరో వేశారని పోలింగ్ బూత్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 141వ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లిన వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురైంది. మంగమ్మ అనే వృద్ధురాలి ఓటును ముందుగానే వేశారని పిఓ చెప్పడంతో ఆమె తన గుర్తింపు కార్డు, ఓటర్ కార్డును చూపిస్తూ నా ఓటును నేను కాక ఇంకెవరు వేస్తారు దొంగ ఓటు వేయడానికి వచ్చిన వారి దగ్గర గుర్తింపు కార్డులు పరిశీలించకుండా ఎలా ఓటు వేయడానికి అనుమతిస్తారని అధికారులు నిలదీసింది. కచ్చితంగా నా ఓటు నేను వినియోగించుకోవాలి అంటూ భీష్మంచి కూర్చుంది. దీనితో అక్కడ ఉన్న సిబ్బంది టెండర్ ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లారు.
'ఈ ఎన్నికలు భవిష్యత్‌కు బాటలు' - వైఎస్సార్సీపీ నేతల దాడులపై చంద్రబాబు ఫైర్ - AP ELECTIONS 2024
తిరగబడిన టీడీపీ నేతలు: తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ శ్రేణులు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నగరంలోని రాయల్ నగర్, ఖాదీకాలనీ ప్రాంతాలలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను బీజేపీ, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను టీడీపీ, బీజేపీ కార్యకర్తలు నిలదీయడంతో పోలింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగారు. దొంగఓట్లు వేయడానికి వస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ నేతలు దాడి: దొంగఓట్లను అడ్డుకున్న కూటమి నేతలపై వైసీపీ నేతలు దాడికి దిగారు. తిరుపతి నగరంలోని సీకాం కాలేజీలోని 250 బూత్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం రావడంతో కూటమి అభ్యర్ధి ఆరణి శ్రీనివాసుల కుమారుడు ఆరణి జగన్ బూత్ వద్దకు చెరుకున్నారు. పోలింగ్ కేంద్రం ఆవరణలోకి వెళ్తుండగా వైసీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి అడ్డున్నారు. ఏజెంట్ కాకుండా లోపలికి ఎలా వస్తారంటూ జగన్‌పై శేఖర్ రెడ్డి దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుగుణమ్మ అనుచరుడు రామకృష్ణపై కూడా శేఖర్ రెడ్డి దాడికి యత్నించారు. దీంతో ఇరువర్గాలు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యం చేసుకోవడంతో వివాదం సర్ధుమణిగింది.