TDP Ra kadali Ra Meetings in Nellore and Palnadu : అధికార వైఎస్సార్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు నేడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. హైదరాబాద్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పసుపు కండువా కప్పుకున్నారు. నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గురజాలలో లావు శ్రీకృష్ణ దేవరాయులు టీడీపీలో చేరనున్నారు. NTR జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సైకిల్ ఎక్కుతున్నారు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈ ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. వసంత వెంట వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీపీలు, సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు సహా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు.
Chandrababu Tour : వైసీపీకి మళ్లీ ఓటేస్తే.. ప్రజలకు గొడ్డలి పోటే : చంద్రబాబు
నెల్లూరు VPR కన్వెన్షన్ హాల్ వేదికగా నిర్వహిస్తున్న భారీ సభా వేదికగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakar reddy), ఆయన సతీమణి ప్రశాంతి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు నేడు తెలుగుదేశంలో చేరనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు చంద్రబాబు నెల్లూరు చేరుకుంటారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోకి వచ్చారు. ఈ రోజు సభ తర్వాత మండల, డివిజన్, నెల్లూరు కార్పొరేషన్ స్థాయి నాయకులు కూడా తెలుగుదేశంలో చేరనున్నారు.
కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైంది - వచ్చే ఎన్నికల్లో పాండవులదే గెలుపు
నెల్లూరులో సభ తర్వాత సాయంత్రం 4గంటలకు హెలికాఫ్టర్‌లో చంద్రబాబు దాచేపల్లి చేరుకుంటారు. దాచేపల్లి (Dachepalli) జరిగే రా కదిలిరా సభలో పాల్గొంటారు. ఈ సభా వేదికగానే టీడీపీలో చేరనున్నట్లు లావు కృష్ణదేవరాయలు ప్రకటించారు. పల్నాడు అభివృద్ధి కోసం ప్రజలకు తనకు మద్దతివ్వాలని కోరారు. దాచేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రా కదలిరా సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మంది అభిమానులు, కార్యకర్తలు హాజరవుతారని నాయకులు అంచనా వేస్తున్నారు. నరసరావుపేట పార్లమెంటరీ పరిధిలో తెలుగుదేశం - జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని తెలుగుదేశం నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని టీడీపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ(Ysrcp) జెండాలతో రెపరెపలాడే నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ రంగు వెలిసింది. టీడీపీలో చేరికలతో వైఎస్సార్సీపీ కంచుకోటగా చెప్పుకునే సింహపురిలో కోటకు బీటలు వారాయని ప్రచారం జోరందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాకకోసం ఉమ్మడి నెల్లూరు జిల్లా రోడ్లన్నీ పసుపు జెండాలతో నిండిపోయాయి. లెక్కలేనంత మంది వైసీపీ ఉద్దండుల చేరికలతో నెల్లూరులో సభ ముస్తాబైంది.
Chandrababu Meeting in Pulivendula: పసుపుమయంగా పులివెందుల.. భారీగా తరలివచ్చిన ప్రజలు
చంద్రబాబునాయుడు ఉదయం 10.30గంటలకు నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరు వీపీఆర్ (PVR) కన్వెషన్ హాలులో భారీ సభ నిర్వహిస్తారు. సభ ప్రధాన ఉద్దేశం, ప్రముఖ పారిశ్రామిక వేత్త, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మరి కొందరు కార్పోరేటర్లు టీడీపీలో చేరుతున్నారు.
వైఎస్సార్సీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఫ్యానుకు ఎదురుగాలి వీస్తోంది. ఇప్పటికే గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడారు. ఈ రోజు సభతో మండల , డివిజన్ , నెల్లూరు కార్పోరేషన్ స్థాయి ప్రముఖ నాయకులు టీడీపీలో చేరనున్నారు. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా అధికార పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ విజయంపై ఐప్యాక్ బృందం సందేహాలు వ్యక్తం చేయడంతో నరసరావుపేటకు ఎంపీ అభ్యర్థిగా పంపించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ప్రముఖుడు కొండూరుపాడు కమలాకర్ రెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. కోవూరు నియోజకవర్గంలోనూ నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కూడా టీడీపీ(TDP)లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రతి రోజు ఎవరో ఒకరు రాజీనామా చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాంధ్రపై కాదు - ఇక్కడి భూములపైనే జగన్‌కు ప్రేమ: చంద్రబాబు